Big Stories

Kiran Bedi Biopic: వెండితెరపైకి కిరణ్ బేడి బయోపిక్.. టైటిల్ ఫిక్స్..!

Biopic of Kiran Bedi: దేశంలో మొట్టమెదటి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడి జీవితం వెండితెరపైకి రానుంది. ఈ మేరకు ‘బేడి: ది నేమ్ యు నో.. దిస్టోరీ యూ డోన్ట్’ టైటిల్ ఫిక్స్ చేశారు. ‘వన్ వే, అనదర్ టైమ్’ వంటి సినిమాలు అందించిన డైరెక్టర్ కుశాల్ చావ్లా ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఇండియాస్ డ్రీమ్ స్లేట్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

సినిమాలో కీలక సన్నివేశాలు..

- Advertisement -

ఐపీఎస్ 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడి పోలీసు శాఖలో ఉన్నత పదవులు చేపట్టింది. డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ బేడి.. 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంది. అయితే ఆమె జీవితంలో ఎదుర్కొన్న అనేక సవాళ్ల గురించి మాత్రమే కాకుండా ఆమె జీవితంలోని వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను కూడా సినిమాలో పలు కీలక సన్నివేశాల్లో చూపిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

త్వరలోనే ఆమె పాత్రపై క్లారిటీ..

తొలిసారి కిరణ్ బేడి 1966లో జాతీయ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌గా వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్‌గా పదవి చేపట్టి ఆమె.. పోలీసు శాఖలో అనే సంస్కరణలు చేపట్టి మెగసెసె అవార్డతో సహా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. 2016 మే 29న పాండిచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు. అయితే వెండితెరపై ఆమె పాత్రను ఎవరు చేస్తారనే విషయంపై మేకర్స్ ప్రకటించలేదు. అయితే త్వరలోనే ఆమె బయోపిక్‌లో ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Also Read: తండ్రి ప్రమాణ స్వీకారానికి అకీరా, ఆద్య.. పవన్‌కు రేణు విషెస్..

‘ఐ డేర్’ ఆత్మకథ..

అమృత్‌సర్‌లో 1949 జన్మించిన కిరణ్ బేడి.. అక్కడే విద్యాభ్యాసం కొనసాగించింది. తర్వాత రాజనీతి శాస్త్రంలో పంజాబ్ యూనివర్సిటీ, చండీఘర్ నుంచి ఎంఏ పట్టా పొందారు. ఉద్యోగంలో చేరిన తర్వాత 1988లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత 1993లో ఢిల్లీ ఐఐటీ పీహెచ్‌డీ పట్టాను ప్రధానం చేసింది. ఐపీఎస్‌గా బాధ్యతలు చేపట్టింది. ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా కిరణ్ బేడి ధైర్య సాహసాలతో తన బాధ్యతలు నిర్వహించింది. సుమారు 9వేల మంది ఖైదీలు ఉన్న తీహార్ జైలుకు బదిలీ అయ్యాక అక్కడ ఖైదీలపై సేవా దృక్పథాన్ని ప్రదర్శించింది. ఈమె చేసిన సేవలకు పలు అవార్డులు వరించాయి. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి పౌర పోలీస్ సలహాదారుగా నియమించిన తొలి మహిళ కిరణ్ బేడి కావడం విశేషం. ఈమె ‘ఐ డేర్’ పేరుతో తన ఆత్మకథను రాసుకున్నారు. కాగా, కిరణ్ బేడి బయోపిక్‌లో ఈ అంశాలు ఉండనున్నట్లు మేకర్స్ తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News