Big Stories

Bharateeydu 2: కల్కి అయ్యింది.. ఇక భారతీయుడు కోసం బయల్దేరిన కమల్

Bharateeydu 2: లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే కల్కి2898AD నిన్న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. మొట్ట మొదటిసారి కమల్ హాసన్.. కల్కిలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే పార్ట్ 1 లో కమల్ కేవలం గెస్ట్ రోల్ లోనే నటించాడు. ఈ విషయం ముందే నాగ్ అశ్విన్ చెప్పినట్లు కూడా తెలిపాడు. తన పాత్ర అంతా సెకండ్ పార్ట్ లో ఉండనుందని కూడా తెలిపాడు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు కమల్ నట విశ్వరూపాన్ని చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమా తరువాత కమల్ నటిస్తున్న మరో చిత్రం భారతీయుడు 2. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 12 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాదాపు 20 ఏళ్ళ తరువాత భారతీయుడు సేనాపతి మరోసారి వస్తుండడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.

- Advertisement -

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారింది. తాజాగా భారతీయుడు బ్యాచ్.. మలేషియా వెళ్లారు. అక్కడ ఫ్యాన్స్ మీట్ కు అటెండ్ కానున్నారు. స్పెషల్ ఫ్లైట్ లో కమల్ హాసన్, సిద్దార్థ్, ఎస్ జె సూర్య.. మలేషియాలో ల్యాండ్ అయ్యారు.  ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

కమల్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టగా.. సిద్దార్థ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో పిచ్చెక్కించాడు. అయితే శంకర్ మాత్రం ఈ ప్రమోషన్స్ లో కనిపించలేదు. ఒకవేళ గేమ్ ఛేంజర్ షూట్ లో ఉండొచ్చని తెలుస్తోంది. మరి కల్కి తో హిట్ అందుకున్న కమల్.. ఇండియన్ 2 తో హిట్ అందుకుంటాడో లేదో తెలియాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News