Big Stories

June 2024: ఒక్క జూన్ లోనే ఇన్ని అద్భుతాలా.. ?

June 2024: 2024.. ప్రపంచం మొత్తానికి ఏమో కానీ, ఇండియా కు మాత్రం ఈ ఏడాది ఎన్నో శుభాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా జూన్ నెల మొత్తం శుభాలనే అందించింది. ఒకటి కాదు రెండు కాదు మూడు విషయాల్లో జూన్ ను అభిమానులు ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు. సాధారణంగా యువత ఎక్కువ ఇష్టపడేవి మూడే మూడు. ఒకటి సినిమా, రెండు క్రికెట్, మూడు రాజకీయాలు. ఈ మూడు రంగాల్లో అద్భుతాలు జరిగాయి.. అది కూడా జూన్ లోనే. మరి అంతలా ఒక్క నెలలో ఏం జరిగాయి అనేది చూద్దాం.

- Advertisement -

పాలిటిక్స్:

- Advertisement -

సాధారణంగా యువతకు ఎక్కువ రాజకీయాల గురించి తెలియదు అంటారు. కానీ, ఈసారి రాజకీయ చరిత్రను తిరగరాసింది మాత్రం కచ్చితంగా యువతే అని చెప్పాలి. ముఖ్యంగా జనసేనను గెలిపించడానికి వారు చేసిన కృషి అంతా ఇంతా కాదు. పదేళ్లుగా పవన్ కళ్యాణ్ పడే కష్టాన్ని కళ్లారా చూసి.. అతనికి సపోర్ట్ గా వారు నిలిచిన విధానం ఎంతో ప్రశంసనీయం. ఇక యువత మొత్తం ఈసారి పవన్ ను సీఎం గా చూడాలనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటు వేసి ఎట్టకేలకు పవన్ ను గెలిపించారు. ఎలా అంటే.. మునుపెన్నడూ లేని విధంగా 21 స్థానాల్లో నిలబడితే 21 స్థానాలను గెలిపించారు. ఎమ్మెల్యే గా మొదటిసారి గెలిచినా పవన్ ను ఏకంగా డిప్యూటీ సీఎం ను చేశారు. జూన్ 12 న పవన్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. అలా జూన్ 4 న ఎన్నికల్లో కూటమి గెలిచి రికార్డు సృష్టించింది.

సినిమా:

బాహుబలి తరువాత ప్రభాస్ కు సరైన హిట్ లేదు అంటే అతిశయోక్తి కాదు. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. బాహుబలి 2 తరువాత.. రాధే శ్యామ్, సాహో, ఆదిపురుష్, సలార్ లాంటి సినిమాలు చేశాడు. కలక్షన్స్ గురించి పక్కన పెడితే.. ఈ సినిమాలన్నీ మిక్స్డ్ టాక్ ను అందుకున్నాయి. ఇక బాహుబలి లాంటి మంచి హిట్ కోసం ప్రభాస్ సైతం ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలోనే కల్కి వచ్చింది ఎన్నో వాయిదాల తరువాత కల్కి2898AD.. జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా వచ్చిన కల్కి సినిమా ఇంటర్నేషనల్ లెవల్ లో మంచి హిట్ ను అందుకుంది. నాలుగు రోజుల్లో రూ. 555 కోట్లు రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. జూన్ నెలలో మొదటి విజయం పాలిటిక్స్ లో వస్తే.. రెండో విజయం సినిమాలో వచ్చింది.

క్రికెట్:

ఇక ఇప్పటికే రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ గెలవడం హైలెట్ అనుకుంటే.. కల్కి సినిమాతో తెలుగు సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని మరో మెట్టు ఎక్కింది. ఇక ఈ రెండు కాకుండా క్రికెట్ పరంగా.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ ను టీమిండియా ఈ ఏడాది గెలిచింది. ఇండియా 14 ఏళ్ళ తర్వాత మరల టీ20 వరల్డ్ కప్ అందుకోవడం మరింత హైప్ క్రియేట్ చేసింది. రోహిత్ శర్మ సారధ్యంలో ఇండియన్ క్రికెట్ టీమ్ అరుదైన రికార్డ్ సాధించింది. ఇక దీంతో ఇండియా సంబురాల్లో మునిగిపోయింది. ఇది కూడా జూన్ లోనే జరిగింది.

ఇలా ఈ మూడు రంగాలకు సంబంధించిన అద్భుతాలు జూన్ లోనే జరిగాయి. ఇదంతా యాదృచ్ఛికమే అయినా జూన్ నెల మాత్రం అదృష్టమని అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం ఈ సంఘటనలపై మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని అద్బుతాలు జరుగుతాయో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News