Big Stories

Allu Arjun: బన్నీతో ఆ హీరోలు రాజకీయం చేస్తున్నారా.. ?

Allu Arjun latest news(Tollywood news in telugu): ఈ ఏడాది అల్లు అర్జున్ టైమ్ అస్సలు బాగోలేదా.. ? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. ఈ ఏడాది మొదట్లోనే బన్నీ నేషనల్ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అందరి నోటా బన్నీ పేరు మారుమ్రోగిపోయింది. ఇక బన్నీకి తిరుగులేదు. పాన్ ఇండియా స్టార్స్ లలో ఒకడిగా సెట్ అయ్యాడు అని అనుకున్నారు.

- Advertisement -

ఇక ఆ తరువాత పుష్ప 2 ఆగస్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడంతో.. ఈ సమయంలో ఈ సినిమా వస్తే అస్సలు తిరుగులేదు అనుకున్నారు. కానీ, అప్పుడే ఏపీ ఎన్నికలు వచ్చాయి. రాజకీయాలకు దూరంగా ఉండే బన్నీ.. అనుకోకుండా చేసిన ఒక పని అతనిని కొన్ని వివాదాల్లోకి నెట్టింది. స్నేహితుడు కోసం చేసిన ఒక పని.. విమర్శల పాలు చేసింది. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ ఇస్తూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్.. ఆ తరువాతి రోజు వైసీపీ నేతకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి నంద్యాల వెళ్లి వచ్చాడు. అయితే దాన్ని ప్రచారం అనుకోని.. బన్నీ, వైసీపీ నేతకు సపోర్ట్ చేయడం మంచిది కాదని మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

- Advertisement -

సొంత మామను కాదని, భార్య స్నేహితుడు కోసం వెళ్లడం తప్పు అని ఎత్తి చూపారు. దీని తరువాత మెగా – అల్లు కుటుంబాల మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ఒకపక్క నాగబాబు.. సొంతవాడు .. పరాయివాడు అని ట్వీట్ చేసి ఈ వివాదాన్ని ఇంకా పెంచగా.. ఇంకోపక్క సాయి ధరమ్ తేజ్.. బన్నీని, స్నేహరెడ్డిని ఆన్ ఫాలో చేసి మరింత ఆజ్యం పోశాడు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య మాటలు కూడా లేవు అనే మాటలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అల్లు కుటుంబం కనిపించలేదు. ఇప్పటికీ ఈ ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. ఈ వివాదంపై అటు అల్లు కుటుంబం కానీ, ఇటు మెగా కుటుంబం కానీ స్పందించింది లేదు.

ఇలాంటి సమయంలో పుష్ప 2 వచ్చి హిట్ అందుకుంటే దానివలన అయినా కొద్దిగా ఈ ట్రోలింగ్ కు ఫుల్ స్టాప్ పడుతుంది కదా అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురయ్యింది. సినిమా ఇంకా పూర్తి కాకపోవడంతో పుష్ప 2 ఆగస్టు నుంచి డిసెంబర్ కు వాయిదా పడింది. ఇది కూడా బన్నీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. బన్నీ కోలీవుడ్ ప్రాజెక్ట్ కూడా అటకెక్కింది.

తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. జవాన్ తరువాత అట్లీ రేంజ్ మారిన విషయం తెల్సిందే. దీంతో ఈ కాంబో అనగానే ఒక్కసారిగా హైప్ తో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని ఎదురుచూసారు. అయితే ఇది సెట్స్ మీదకు వెళ్లకముందే ఆగిపోయింది. దానికి కారణం అట్లీ రెమ్యూనిరేషన్ అని టాక్. అయితే దీని వెనుక బడా హీరోల రాజకీయం ఉందని టాక్ నడుస్తోంది.

అట్లీకి తమిళ్ లో హిట్ ఇచ్చిన విజయ్, హిందీలో హిట్ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. బన్నీపై రాజకీయం చేసారని కోలీవుడ్ కోడై కూస్తోంది. బన్నీకి వినిపించిన కథను అట్లీ.. షారుఖ్ కు వినిపించాడట. ఇక కథ విన్న షారుఖ్.. ఈ కథ బన్నీ కంటే సల్మాన్ కు బావుంటుందని చెప్పి.. సల్లుభాయ్ తో మీటింగ్ కూడా పెట్టించాడట. విజయ్ సైతం.. సల్మాన్ ఖాన్ కే బావుంటుందని చెప్పడంతో.. అట్లీ ఎలాగైనా బన్నీని తప్పించడానికి రెమ్యూనిరేషన్ పేరు చెప్పి తప్పించుకున్నాడట.

మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఆ హీరోలు చేసిన రాజకీయాల వలన బన్నీకి మళ్లీ పెద్ద దెబ్బనే తగిలింది. ప్రస్తుతం బన్నీ చేతిలో పుష్ప 2 ఒకటి ఉండగా.. దీని తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా ఉంది.డిసెంబర్ వరకు ఆగితే.. పుష్ప 2 తో అల్లు అర్జున్ కొట్టే రికార్డులకు హిందీ ఇండస్ట్రీ మొత్తం బన్నీ వద్దకే వస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి పుష్ప 2 ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News