Big Stories

Kalki 2898 AD: కల్కి టీమ్ కు గుడ్ న్యూస్.. ఏపీలోనూ టికెట్ రేట్ల పెంపుకు అనుమతి..

AP Govt Approved Kalki 2898 AD Tickets Price Hike: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కల్కి 2898 AD. జూన్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు కల్కి సిద్ధమైంది. రిలీజ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. కల్కి టీమ్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే విడుదలైన కల్కి సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఇది మరొక బిగ్గెస్ట్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.

- Advertisement -

ఇప్పటికే తెలంగాణలో కల్కి సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 27 నుంచి జులై 4వ తేదీ వరకూ 8 రోజులపాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిచ్చింది. టికెట్ ధరపై గరిష్టంగా రూ.200 పెంచుకునేలా అనుమతివ్వడంతో.. ఏకంగా మల్టీప్లెక్స్ లలో టికెట్ ధర రూ.500కు చేరింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ లలో రూ.100 మేరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని చెప్పింది. దీంతో సాధారణ థియేటర్లలో టికెట్ ధర రూ.150 ఉండగా ఇప్పుడు రూ.250కి చేరింది. రూ.75 టికెట్ ధర రూ.150కి పెరిగింది.

- Advertisement -

తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ కల్కి 2898 AD సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 27 నుంచి 2 వారాలపాటు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతిచ్చింది. నిర్మాత అశ్వనీదత్ వినతి మేరకు.. టికెట్ల రేట్లను పెంచుకోవడంతో పాటు.. అదనపు షో లకు కూడా అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ ల్లో రూ.125 వరకూ పెంచుకోవచ్చని చెప్పింది. అలాగే రోజుకు 5 షో లు వేసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఆ పండక్కే!

ఇక కల్కి సినిమా నటీనటుల రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. చాలా పెద్దమొత్తంలోనే తీసుకున్నారని టాక్. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, రానా, దిశాపటానీ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా కోసం రూ.700 కోట్ల మేర ఖర్చైతే.. లీడ్ రోల్ లో నటించిన ప్రభాస్ రూ.150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దీపికా రూ.20 కోట్లు, అమితాబ్ బచ్చన్ రూ.20 కోట్లు, కమల్ హాసన్ రూ.20 కోట్లు, దిశాపటాని రూ.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతో తెలీదు గానీ.. అన్ని కోట్ల పారితోషికమా అని విషయం తెలిసిన వారు నోరెళ్లబెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News