Big Stories

Anushka Laughing Disorder: దేవసేన అనుష్కకు వింత వ్యాధి..లాఫింగ్ డిజార్డర్ ఏంటో తెలుసా..?

Anushka Suffering with Laughing Disorder: టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. సూపర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు వింత వ్యాధి ఉందని తెలియగానే అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ వ్యాధి ప్రమాదకరమైనది కాదని తెలియడంతో స్వీటీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా, ఈ వ్యాధి విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇలాంటి వ్యాధి కూడా ఉంటుందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనుష్క ఈ వ్యాధి గురించి పలు విషయాలు పంచుకుంది. ‘ నేను లాఫింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్నా. నేను ఒక్కసారి నవ్వడం మొదలుపెడితే.. 15 నుంచి 20 నిమిషాల వరకు నవ్వుతూనే ఉంటాను. షూటింగ్ సమయాల్లోనూ చాలా సార్లు నవ్వాను. కొన్నిసార్లు ఎక్కువగా నవ్వుతూ నేలపై దొర్లాను.’ అని వెల్లడించింది.

- Advertisement -

లాఫింగ్ డిజార్డర్ ఏంటి..?
అనుష్క శెట్టి ఇబ్బంది పడుతున్న ఈ వింత వ్యాధిని సూడోబుల్బార్ ఎఫెక్ట్ లేదా పీబీఏ అంటారు. సూడోబుల్బార్ ఎఫెక్ట్ అనేది ఒక ఎమోషనల్ ఇన్ కంటినెన్స్. అంటే ..న్యూరోలాజికల్ డిజార్డర్ అన్నమాట. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారు కంటిన్యూగా నవ్వుతారు. లేదా ఆపకుండా ఏడవడం మొదలుపెడతారు.

Also Read: ఆ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ క్రైమ్ కథా చిత్రమ్.. వరుస ఫ్లాప్ ల తర్వాత హిట్ వచ్చేనా ?

లాఫింగ్ డిజార్డర్ వ్యాధి భావోద్వేగ స్థితికి అనుగుణంగా లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా మెదడు గాయం లేదా నరాల పరిస్థితి వల్ల రావొచ్చని అంటున్నారు. ఈ వ్యాధి వారు నవ్వడం ప్రారంభిస్తే ఆపడం కష్టమంటున్నారు.

ఈ వ్యాధి ఉన్న వ్యక్తుల్లో 3 నుంచి 42 శాతం మందిని ప్రభావితం చేస్తుంది. దీనికి ఖచ్చితమైన కారణం తెలియదు. కానీ మల్టిపుల్ స్క్లెరోసిస్, అల్జీమర్స్ వ్యాధి, బ్రెయిన్ ట్యూమర్చ మూర్చ వంటి వ్యాధులకు కారణమవుతుందని చెబుతున్నారు.

లాఫింగ్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు నవ్వే సమయంలో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. దీంతో నవ్వు ఆగడం ప్రారంభమవుతోంది. అలాగే మనసును ఇతర వాటికి మళ్లించడంతో దీనిని నివారించవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News