Big Stories

Anupam Kher’s office robbery: నటుడు అనుపమఖేర్ ఆఫీసు చోరీ, తలుపు బద్దలు కొట్టి మరీ..

Anupam Kher’s office robbery: బాలీవుడ్ ఫేమస్ నటుడు అనుపమఖేర్. బాలీవుడ్‌తోపాటు తెలుగు లోనూ చాలా సినిమాల్లో నటించారాయన. కార్తికేయ 2, టైగర్ నాగేశ్వరరావు మూవీలతో టాలీవుడ్ ఆడియన్స్‌‌ను మెప్పించాడు.. మరింత దగ్గరయ్యాడు. అంతేకాదు హిందుత్వం గురించి ఆయన చెప్పే మాటలు, భక్తి భావాన్ని ప్రచారం చేసే వీడియోలు చాలా మందిని మెప్పిస్తుంటాయి. ఏ విషయానైనా ముక్కుసూటిగా మాట్లాడుతాడు.

- Advertisement -

చాలా ప్రాజెక్టులతో అనుపమఖేర్ బిజీగా ఉన్నారు. ముంబైలోని వీరదేశాయ్ రోడ్డులో ఆయనకు ఆఫీసు ఉంది. అందులో దొంగలు పడ్డారు. అందుకు సంబంధించిన వీడియోను ఆయన స్వయంగా షేర్ చేశారు. అంతేకాదు డోర్ విరగొట్టి మరీ అందులోకి ప్రవేశించినట్టు చెప్పారు.

- Advertisement -

చాలా ప్రాజెక్టులతో అనుపమఖేర్ బిజీగా ఉన్నారు. ముంబైలోని వీరదేశాయ్ రోడ్డులో ఆయనకు ఆఫీసు ఉంది. అందులో దొంగలు పడ్డారు. అందుకు సంబంధించిన వీడియోను ఆయన స్వయంగా షేర్ చేశారు. అంతేకాదు డోర్ విరగొట్టి మరీ అందులోకి ప్రవేశించినట్టు చెప్పారు. కార్యాలయంలోని ఓ సినిమాలో తన నెగిటివ్‌ రోల్‌కి సంబంధించిన డీటేల్స్‌ని ఎత్తుకెళ్లారు.

ALSO READ:  ప్రమోషన్స్ హోగయా.. నీకు బాగా హ్యాపీగా ఉన్నది కదా డార్లింగ్

దొంగలు తీసుకెళ్లిన ప్రతీ వస్తువు సీసీకెమెరాలో రికార్డు అయ్యిందని ఆయన చెబుతున్నారు. ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్వరలో దొంగలను పట్టుకుంటామని అభయం ఇచ్చారు. ఆ దొంగలకు దేవుడే తగిన బుద్ది చెబుతారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారాయన. ఇంతకీ ఆయనకు క్యారెక్టర్‌కు సంబంధించిన డీటేల్స్ దొంగిలించినవారెవరు? కావాలనే ఎవరైనా చేశారా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News