Big Stories

AA Fans Attack on RP Hotel: కిర్రాక్ ఆర్పీ హోటల్స్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి..?

Allu Arjun Fans Attack on Kiraak RP Hotels: జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లో కిర్రాక్ ఆర్పీ ఒకడు. చేసినన్ని రోజులు ఈ షోలో చేసి బయటకు వచ్చేసి హోటల్ బిజినెస్ లోకి దిగాడు. నెల్లూరు చేపల పులుసు అనే పేరుతో క్లౌడ్ కిచెన్ ను ఏర్పాటు చేసి మంచి ఫుడ్ ను ప్రజలకు అందిస్తున్నాడు. ఒక్క ఫుడ్ స్టాల్ తో మొదలైన ఈ వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగి హైదరాబాద్ లోనే పలు ఏరియాల్లో ఆర్పీ రెస్టారెంట్స్ ను నడుపుతున్నాడు.

- Advertisement -

ఇక ఈ ఆర్పీ హోటల్స్ కు ప్రజలు క్యూ కడుతున్నారు. రేట్ ఎక్కువ అయినా కూడా టేస్ట్ బావుందని టాక్ రావడంతో ప్రజలు కొనడం మొదలుపెట్టారు. ఇక ఈ ఫుడ్ బిజినెస్ ను పక్కనపెట్టి ఆర్పీ.. రాజకీయాల్లోకి దిగాడు. జనసేన తరుపున ప్రచారం మొదలుపెట్టాడు. జబర్దస్త్ కమెడియన్స్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు కానీ, ఆర్పీలా ఇంటర్వ్యూలు ఇచ్చి రచ్చ మాత్రం చేయలేదు. మొన్నటికి మొన్న రోజా పై ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. డైమండ్ రాణి అంటూ మాట్లాడాడు. అయితే ఆర్పీ చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉండడంతో ఎవరు ఏమి అనలేదు.

- Advertisement -

ఇక ఆ ధైర్యంతోనే ఈసారి ఆర్పీ.. అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. “అల్లు అర్జున్ గారు ఇలా చేయడం బాగాలేదండి. శిల్పా రామచంద్రారెడ్డి మీకు మంచి స్నేహితుడు కాబట్టి మీరు సపోర్ట్ చేసారు అని చెప్పుకొచ్చారు. మరి చిన్నతనం నుంచి పవన్ కళ్యాణ్ గారి మంచితనం మీకు తెలియదా..? మెగా కుటుంబంలోనే కదా మీరు పెరిగారు. మీ నాన్నగారి సొంత చెల్లినే కదా చిరంజీవి గారు పెళ్లి చేసుకున్నారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మీకు బంధువే కదా.. మరి ఇన్ని తెలిసి కూడా మీరు వైసీపీ నేతకు ఎలా సపోర్ట్ చేశారు..?

Also Read: Ram Charan – Game Changer: స్పెషల్ సాంగ్ కోసం శంకర్ భారీ ప్లాన్.. మాస్ బీట్స్ సిద్ధం చేస్తున్న థమన్..!

ఇప్పుడు మీకున్న ఫ్యాన్స్ లో చాలా మంది మెగా ఫ్యాన్స్ మాత్రమే.. వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొనే మీరు ఈ స్థాయికి వచ్చారు. రాష్ట్రం కోసం పదేళ్లుగా కష్టపడుతున్న మావయ్య పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడంనాకు నచ్చలేదు. దీని మెగా ఫ్యామిలీ స్పందించకపోయిన నేను స్పందిస్తానని” చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాటలకూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. దీంతో వారు ఆర్పీ చేపల పులుసు రెస్టారెంట్ పై దాడులు చేశారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News