Big Stories

Jupiter Transit: బృహస్పతి అనుగ్రహంతో ఏడాదంతా ఈ రాశుల వారికి అన్నీ శుభాలే !

Jupiter Transit 2024: బృహస్పతిని నవగ్రహాలలో దేవ గురువుగా భావిస్తారు. అంతేకాకుండా దీనిని అదృష్ట, శుభ గ్రహంగా పరిగణిస్తారు. ఇతర గ్రహాల లాగానే బృహస్పతి తనరాశి నక్షత్రాన్ని మార్చుకుంటూ సంచరిస్తుంది. ఈ ఏడాది మే 1న వృషభ రాశిలోకి ప్రవేశించిన బృహస్పతి ప్రయాణం సాగిస్తుంది. మే 2025 వరకు ఇదే రాశిలో బృహస్పతి సంచరిస్తాడు.

- Advertisement -

శుక్రుడు వృషభరాశికి అధిపతి. ఈ సందర్భంలో బృహస్పతి తన రాశి మార్చుకోవడం వల్ల ఏడాది పాటు కొన్ని రాశుల వారికి ప్రయోజనం ఉంటుంది. 2025 వరకు ఏయే రాశుల వారికి బృహస్పతి వల్ల ఆనందం, అదృష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి:
మేషరాశి వారికి గురు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. 2025 వరకు బృహస్పతి వల్ల వీరు సంపన్నులుగా ఉంటారు. గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు ప్రారంభిస్తారు. ఆదాయంలోనూ పెరుగుదల ఉంటుంది. ఈ రాశి జాతకులు అదృష్టవంతులుగా ఉంటారు. డబ్బు కూడా ఆదా చేసుకుంటారు. ప్రజల్లో వీరికి జనాదరణ పెరుగుతుంది. భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.
వృషభరాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి వల్ల పరిశోధన సంబంధిత రంగాల్లో పనిచేసే వారికి గొప్ప విజయాలు అందుతాయి. వృషభరాశి వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. కానీ ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం అవసరం. వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశికి అధిపతి బృహస్పతి. అందుకే ఈ రాశుల అదృష్టం గరిష్ట స్థాయిలో ఉంటుంది. లక్ష్యాలను సాధించడంలో ఎదురయ్యే సమస్యలు ఊహించని విధంగా తొలగిపోతాయి. బృహస్పతి అనుగ్రహంతో విజయాలను సాధిస్తారు. సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతే కాకుండా మంచి జీవితాన్ని ఆస్వాదిస్తారు.

- Advertisement -

Also Read: మాలిక రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు !

సింహరాశి:
బృహస్పతి సింహరాశి 11వ ఇంటిలో సంచరిస్తాడు. ఈ సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సింహరాశి వారి కృషికి గుర్తింపు లభిస్తుంది. అప్పగించిన పనులు పూర్తి చేసేందుకు వీరు చేసే కృషి ఉన్నతాధికారులు గుర్తిస్తారు. సత్వంగా ఆస్తిని పొందుతారు. అంతే కాకుండా జీవితం మరింత మధురంగా ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News