Big Stories

Grahan Yog: గ్రహణ యోగం అంటే ఏమిటి ? దీని వల్ల ఎదురయ్యే అనార్థాలేంటి ?

Grahan Yog: గ్రహాలు ఎల్లప్పుడు తమ రాశి స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు వేరే గ్రహంతో సంయోగం చెందుతాయి. ఫలితంగా శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. అటువంటి సమయంలో ఏర్పడే అశుభ యోగాల్లో ఒకటి గ్రహణ యోగం.
గ్రహణ యోగం:
నవ గ్రహాలలో కేతువు, రాహువు నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. ఇవి ఎల్లప్పుడు తిరోగమన దిశలోనే సంచరిస్తాయి. జాతకంలో రాహువు అశుభ స్థానంలో ఉంటే జీవితంలో జరిగే ఆకస్మిక సంఘటనలను ఇది సూచిస్తుంది. చంద్రుడిని చల్లని మనసు కలిగినవాడని చెబుతారు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని స్త్రీ, మనసుకు కారకుడిగా పరిగణిస్తారు.

- Advertisement -

చంద్రుడి స్థానం జాతకంలో వ్యక్తి మానసిక, భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తుంది. దీనితో పాటు చంద్రుడు, రాహువుల కలయిక జాతకంలో చాలా ముఖ్యమైంది. ఈ రాహు చంద్రుల కలయిక అశుభంగా భావిస్తారు. ఎందుకంటే ఇవి రెండు శత్రు గ్రహాలుగా చెబుతారు. ఇది ఒక లోపంగా పరిగణించబడుతుంది. రెండు గ్రహాల కలయిక వల్ల ఏర్పడేదే గ్రహణ యోగం. చంద్రుడు, రాహువు కలయిక ఒక వ్యక్తి మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తుంది.

- Advertisement -

ఈ కలయిక వ్యక్తి జీవితంలో అనేక ప్రతికూల మార్పులను తీసుకువస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చంద్రుడు, రాహు గ్రహాలు అశుభ స్థితిలో ఉంటే ఆ వ్యక్తి జూదానికి అలవాటు పడతాడు. మద్యానికి బానిసయ్యే అవకాశాలున్నాయి. వైవాహిక జీవితంలో సమస్యలను కూడా ఎదుర్కొంటారు. క్రమంగా అందరితో సంబంధాలు బలహీనపడతాయి. రాహు, చంద్రుల కలయిక వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు వాటిని తగ్గించే నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాహు, చంద్రల కలయిక:
చంద్రుడు, రాహుల కలయికను గ్రహణ యోగం అని పిలుస్తారు. దీని కారణంగా వ్యక్తి డిప్రెషన్, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చంద్రుడు, రాహు సంయోగం వ్యక్తి వైవాహిక జీవితాన్ని దెబ్బతీస్తుంది. భార్య, భర్తల మధ్య అపార్ధాలు, అనుమానాలు పెరుగుతాయి. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి. రహస్య శత్రువుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీటి గండం కూడా ఏర్పడే అవకాశం ఉంది.

జాతకంలో రాహు స్థానం క్షీణించినప్పుడు వ్యక్తి వ్యాధులతో బాధపడటం జరుగుతుంది. చంద్రుడు, రాహువు కలయిక వల్ల ఏర్పడే అననుకూల ప్రభావాలను నివారించడానికి మంత్రాన్ని జపించాలి. రాహు, చంద్రుల కలయిక యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించడానికి పగడపు రత్నాన్ని ధరించాలి. ఇది ధరించే ముందు జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలి.

Also Read: రాహు-శని సంయోగంతో జూలై 8 నుండి ఈ రాశి వారికి శ్రేయస్కరం

అమెథిస్ట్ లేదా ఓనిక్స్ రత్నాన్ని కూడా ధరించవచ్చు. ఈ కలయిక చెడు ప్రభావాలను నివారించడానికి శ్రావణ మాసంలో సోమవారాలు ఉపవాసం ఆచరించడం మంచిది. దీంతో శివుడు, రాహు అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతే కాకుండా సోమవారం తెల్లటి వస్తువులను దానం చేయాలి. బోలెనాథుడిని ఆరాధించడం ద్వారా రాహువు, చంద్రుల వల్ల ఏర్పడే అశుభ ప్రభావాల నుంచి బయటపడవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News