Big Stories

Mahabharata War: మహాభారత యుద్ధంలో తండ్రిని మించిన తనయుడు.. వీరాధివీరులను సైతం ఓడించిన యోధుడెవరో తెలుసా..?

Vrishasena Mahabharata War: కర్ణుడు, అతని భార్య వృశాలి యొక్క పెద్ద కుమారుడు. అతను తన తండ్రి కర్ణుడి వలె ధనుర్ విద్యలో పరాక్రమవంతుడు. అస్త్రశస్త్రాలను అవలీలగా ప్రయోగించగల వీరాధివీరుడు. అతనే వృషసేనుడు. తన తండ్రితో పాటు, అతను కౌరవుల వైపు నుండి కురుక్షేత్ర యుద్ధంలో పోరాడాడు, అలాగే ఉపపాండవులు, ద్రుపదుడు, ధృష్టద్యుమ్నుడు, నకులుడు, సహదేవుడు, విరాటుడు మరెందరో ప్రముఖ యోధులను ఓడించాడు.

- Advertisement -

కురుక్షేత్ర యుద్ధ సమయంలో కర్ణుడు భీష్మునితో ఏర్పడిన వివాదం కారణంగా మొదటి పదిరోజులు యుద్ధంలో పాల్గొనలేదు. 10వ రోజున భీష్ముడి పతనం తరువాత, కర్ణుడు, అతని 8 మంది కుమారులు 11వ రోజు యుద్ధంలో చేరి పాండవులతో పోరాడారు.

- Advertisement -

యుద్ధం యొక్క 11వ రోజున, వృషసేనుడు ఒకే యుద్ధంలో నకుల కుమారుడైన శతానికను ఓడించాడు, తరువాత ఇతర ఉపపాండవులతో పోరాడి వారందరినీ ఓడించాడు. ఆపై సహదేవుడితో యుద్ధం చేసి అక్కడ అతని విల్లు విరిచి అపస్మారక స్థితికి చేర్చాడు చివరకు సాత్యకి సహదేవుడిని రక్షించాడు.

12వ రోజు యుద్ధంలో వృషసేనుడు పాండవ సైన్యానికి చెందిన మత్స్య సేనలపై దాడి చేసి విరాట రాజును ఓడించి విధ్వంసం సృష్టించి తీవ్రంగా గాయపరిచాడు. ఇది చూసిన అభిమన్యుడు విరాటుడికి సహాయంగా వచ్చాడు. వృషసేనుడు మరియు అభిమన్యుల మధ్య భీకర యుద్ధం జరిగింది. అభిమన్యుడు మరియు వృషసేనుడు ఇద్దరూ వీరాధివీరులు,మహారథులలో అగ్రగణ్యులు. వారి మధ్య భయంకర యుద్ధం జరిగింది.

Also Read: July 1st Week Lucky Rashi: జూలై మొదటి వారం నుండే ఈ రాశుల వారి జీవితాల్లో అదృష్ట మార్పు

మిగతా వీరులందరూ యుద్ధం ఆపి వీరినే చూడసాగారు. రెండు ఏనుగులు ఢీకొన్నట్టుగా, రెండు మెరుపులు ఢీకొన్నట్టుగా వారి మధ్య ప్రళయ భయంకరంగా యుద్ధం సాగింది.. ఒకరిపై ఒకరు బాణాలు సంధించుకున్నారు..ధ్వంధ యుధ్దం చేశారు. ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. చివరకి అభిమన్యుడు, వృషసేనుని రథసారథిని చంపి అతని ధనుస్సును కూడా విరిచాడు. అప్పుడు వృషసేనుడు తన గుర్రంతో యుద్ధరంగం నుండి దూరంగా వెళ్ళాడు.

14వ రోజు వృషసేనుడు పాంచాల రాజు ద్రుపదునిపై యుద్ధంలో పాల్గొని అతనిని ఓడించాడు. కర్ణుడు కూడా ద్రుపదుని ఓడించలేక పోయాడు,ఎందుకంటే కర్ణుడు తన 100 మంది కౌరవ సోదరులతో ఒంటరిగా ద్రుపదుని చేతిలో ఓడిపోయాడు.అలాంటిది వృషసేనుడు ఒంటరిగా ద్రౌపదుడిని ఓడించాడు. వృషసేనుడు పరాక్రమం చూచి తండ్రిని మించిన తనయుడని ద్రుపదుడు పొగిడాడు, అలాగే తన ఓటమిని ఒప్పుకుని అక్కడి నుండి పారిపోయాడు. తరువాత వృషసేనుడు పాండవ సైన్యానికి అధిపతిగా ఉన్న ధృష్టద్యుమ్నుని సైతం ఓడించి పారిపోయేలా చేశాడు.

యుద్ధం యొక్క 17వ రోజున..

దుశ్శాసనుడు మరియు చిత్రసేనుడి మరణానికి కోపగించిన వృషసేనుడు నకుల వద్దకు పరుగెత్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. వృషసేనుడు నకుల గుర్రాలను చంపి, అనేక బాణాలతో అతనిని గాయపరిచాడు. తన రథం నుండి దిగి, నకులుడు తన ఖడ్గాన్ని తీసుకొని వృషసేనుడి వైపు వెళ్ళాడు, ఖడ్గాన్ని డిస్కస్‌లా గిరగిరా తిప్పుతూ తనవైపు వస్తున్న నకులని చూసిన వృషసేనుడు నాలుగు చంద్రవంక బాణాలతో ఖడ్గాన్ని విరగగొట్టాడు.

Also Read: Luckiest Zodiac Sign: రెండు గ్రహాల అరుదైన కలయికతో వచ్చే నెల ఈ రాశులపై లక్ష్మీ అనుగ్రహం..

చివరకు నకులుడు భీముని రథాన్ని అధిరోహించాడు. అర్జునుడు దగ్గరికి రాగానే నకులుడు ఈ పాపాత్ముని సంహరించు అని అడిగాడు. అర్జునుడు వృషసేనుడి వైపుకు రధాన్ని మళ్లించు అతని తండ్రి కనుచూపు మేరలో అతన్ని చంపేస్తాను అని శ్రీకృష్ణుడిని ఆదేశించాడు. వృషసేనుడు అర్జునుడి బాహువును పది బాణాలతో, కృష్ణుడిని పది బాణాలతో పొడిచాడు. అర్జునుడు కోపోద్రిక్తుడై, కర్ణుడితో సహా కౌరవ రాజులతో బిగ్గరగా ఇలా అన్నాడు, ఓ కర్ణా నా కొడుకు అభిమన్యుని అన్యాయంగా చంపినట్లు ఈ రోజు నేను నీ కొడుకును చంపుతాను అని కర్ణుడిని బెదిరించిన అర్జునుడు వృషసేనుని పది బాణాలతో కొట్టాడు..వృషసేనుడికి, అర్జునుడికి మద్య జరిగిన భీకర యుధ్దంలో వృషసేనుడు మరణిస్తాడు.

సో.. ఇదీ వీరాధివీరులను సైతం ఓడించిన యోధుడు వృషసేనుడి కథ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News