Big Stories

Shukra Gochar 2024: శుక్రుడి సంచారంతో లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశులకు అన్నీ విజయాలే

Shukra Gochar 2024: జూలై నెల ఆరంభమైంది. ఈ జూలై నెలలో అనేక గ్రహల్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అందులో శుక్ర గ్రహం మార్పు చాలా ప్రత్యేకం కానుంది. ఈ మాసంలో శుక్రుడు రెండుసార్లు సంచరించబోతున్నాడు. మొదటి సంచారం జూలై 7న కర్కాటకరాశిలో ఉంటుంది. ఆపై జూలై 31న శుక్రుడు సింహరాశిలో సంచరిస్తాడు. ఈ సమయంలో శుక్రుడు లక్ష్మీ-నారాయణ యోగాన్ని ఏర్పరుస్తాడు. శుక్రుని ఈ రెండు సంచారాలు 5 రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే శుక్రుడు ఏ రాశులకు డబ్బు, విజయం అందించబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

మేష రాశి

- Advertisement -

ఈ రాశి వారికి రెండు సార్లు శుక్రుని సంచారం శుభ సమయాన్ని తెస్తుంది. జూలై నెలలో, ఈ రాశివారు చాలా లాభాలను పొందుతారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కెరీర్‌లో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

కర్కాటక రాశి

రెండుసార్లు శుక్రుని సంచారం ఫలితంగా, ఈ రాశి వారు అన్ని రకాల సంతోషాలు మరియు ప్రయోజనాలను పొందుతారు. ఇంట్లో ధన లాభం పెరుగుతుంది. వృత్తి-వ్యాపారాలు బాగా సాగుతాయి. అనుకోని చోట్ల నుంచి డబ్బును పొందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.

తులా రాశి

శుక్రుని సంచారం ఈ రాశి వారికి గొప్ప సమయాన్ని తెస్తుంది. ఊహించని ధనాన్ని పొందడమే కాకుండా దానితో విజయం కూడా పొందుతారు. ఈ సమయంలో ఓ సువర్ణావకాశాన్ని కూడా పొందుతారు. ఆఫీసులో గౌరవం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు కూడా పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి

ఈ సమయం విజయానికి కొత్త తలుపులు తెరుస్తుంది. ఈ రాశి వారి సంపద పెరుగుతుంది. వీరి జీవితాలు ఆనందంతో నిండి ఉంటారు. ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. త్వరలో సంతోషకరమైన వార్తను వింటారు.

మకర రాశి

జూలై నెలలో శుక్రుని సంచారం మకర రాశి వారికి గొప్ప ప్రయోజనాలను తెస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. పాత పెట్టుబడుల వల్ల లాభం ఉంటుంది. ఉద్యోగ ప్రమోషన్, జీతాల పెంపు, కొత్త ఉద్యోగావకాశాలు తోడవుతాయి. వ్యాపారం బాగా మెరుగుపడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News