Big Stories

Shani Dev Blessing: శని దేవుడి అనుగ్రహం.. ఈ వారం రోజులు నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.. పట్టిందల్లా బంగారమే!

Shani Blessing to 4 Zodiac Signs for 4 Days: శని న్యాయ దేవుడు. శని రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటాడు. శని పేరు వింటనే చాలా మంది భయాందోళనలకు గురవుతుంటారు. కానీ శని దేవుడు వ్యక్తుల చర్యలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడు. ఎవరేమి చేసినా శని ఫలితాలు దాని పర్యవసనాలు అనుభవించాల్సిందే. జూన్ 29 నుంచి శని కుంభ రాశిలో తిరోగమనంలో ఉంటుంది. తర్వాత శని తన రాశిని మార్చుకుని మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. శని రాశి మార్పు కారణంగా ఈ వారం పలు రాశుల వారి అదృష్టం మారనుంది.

- Advertisement -

జూన్ చివరి వారంలో కొన్ని రాశుల వారు ఆనందంగా ఉంటారు. అంతే కాకుండా వారి జీవితాల్లో అనేక మార్పులు కలుగుతాయి. శని క్షీణించిన తరువాత శని అర్థ రాశిలో ఉన్న వారికి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వారు శనికి సంబంధించిన పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. శని తిరోగమనం తర్వాత పలు రాశుల వారి జీవితాల్లో మార్పులు జరుగుతాయి. జూన్ 24 నుంచి జూన్ 30 వరకు ఏ రాశులపై శని ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

మేష రాశి:

శని అనుగ్రహంతో మేష రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం ఆర్థికంగా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు మంచి రాబడిని ఇచ్చే పెట్టుబడి, వ్యాపార అవకాశాలను పొందుతారు. శని ప్రభావంతో ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం చేసే ప్రాంతంలో ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది.

Also Read: Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఊహించని లాభాలు!

న్యా రాశి:

శని అనుగ్రహం కన్యా రాశిపై ఉండటం వల్ల వీరు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో లాభాలు సాధిస్తారు. మంచి రాబడి ఇచ్చే పెట్టుబడులను ప్రారంభిస్తారు. మీ జీవితంలో చాలా కాలంగా ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. వ్యాపారం చేసే చోట జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

తులా రాశి:

ఈ రాశి వారి జీవితంలో ఈ వారం రోజుల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. మీరు చేసే పనుల వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా మీ ఖర్చులను నియంత్రించడంతో పాటు పొదుపు చేయడానికి ప్రయత్నించండి. డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

Also Read: ఏడాది తర్వాత సింహరాశిలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి అదృష్టం

మీన రాశి:

శని అనుగ్రహంతో మీన రాశి వారికి కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. అంతే కాకుండా పొదుపు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. మీరు ఎంత కష్టపడి పని చేస్తే అంత మీరు కోరుకున్న ధనం వస్తుంది. మీ భాగస్వామ్యంలో కొనసాగుతున్న వివాదం కూడా పరిష్కరించడుతుంది. యువత తాము కోరుకున్న వృత్తిలో కొనసాగుతారు. మీరు చేస్తున్న ఉద్యోగం కంటే మెరుగైన ఉద్యోగం పొందుతారు. మీ ముందుకు వచ్చే అవకాశాలను వదులుకోవద్దు. మీరు కొత్త పనిని ప్రారంభించినా శని అనుగ్రహంతో వాటిలో విజయం సాధిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News