BigTV English

<a>The Buddha</a>:- బుద్ధుడి నెత్తిపై ఉన్న 108 పీతల రహస్యం

<a>The Buddha</a>:- బుద్ధుడి నెత్తిపై ఉన్న 108 పీతల రహస్యం

The Buddha:- బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడి జన్మస్థలం నేపాల్‌లోని లుంబిని ప్రాంతం.బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు.


రాజభోగాలను వదిలేసి అడవులకు వెళ్లాడు. ఆ సమయంలో యోగిలా మారాడు. ఇందులో భాగంగానే ఆయన తలపై ఉన్న జుట్టును మొత్తం తీసేశాడని చరిత్ర చెబుతోంది. గౌతమ బుద్ధుని ప్రతి విగ్రహంలో కనిపించే ఉంగరాల జుట్టు నిజంగా జుట్టు కాదు. నిజానికి గౌతమ బుద్ధుని తలమీద కనిపించే ఉంగరాల జుట్టు జుట్టు కాదు, నత్తలు. దీని వెనుక ఒక రహస్యం దాగుంది.

ఒకరోజు ఉదయం గౌతమ బుద్ధుడు ధ్యానం కోసం మంచి ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ సమయంలో ఓ చెట్టు కనిపించడంతో దాని కింద కూర్చొని ధ్యానం చేస్తాడు. అయితే ధ్యానంలో మునిగిన బుద్ధుడు సమయం గురించి మరిచిపోతాడు. కొంత సమయం గడిచిన తరువాత సూర్యకిరణాలు చెట్టు కొమ్మల మధ్య నుంచి వచ్చి బుద్ధుడి తలపై పడుతుంటాయి. అటువైపు ఓ నత్త వెళ్తూ బుద్ధుడి ధ్యానం చూసి ఆశ్చర్యపోతుంది. ఇంత ఎండలో బుద్ధుడి ధ్యానాన్ని చూసి ఆయనకు ఏదైనా సాయంచేయాలని అనుకుంటుంది. దీంతో ఆ నత్త మెల్లగా ప్రాకుతూ బుద్ధుని తలపైకి వెళ్తుంది. నత్త కిందిచర్మం చల్లగా ఉంటుంది. దీంతో బుద్దుని తలపైకి సూర్యకిరణాలు రాకుండా ఆపుతుంది. ఇలా మరికొన్ని నత్తలు బుద్ధుని తలపైకి వెళ్తాయి. అలా 108 నత్తలు బుద్ధుని తలపై సూర్యకిరణాలు పడకుండా అడ్డుగా ఉండి ధ్యానం చేయడానికి సాయం చేస్తాయి.


అయితే సూర్యుడి వేడి తట్టుకోలేక ఆ నత్తలు చనిపోతాయి. ఇంతలో బుద్ధుడు ధ్యానం నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ నత్తలు చూసిన బుద్ధుడు జరిగిన దానిని గ్రహిస్తాడు. అలా తన ధ్యానానికి సాయపడిన నత్తలు అమరవీరులుగా గుర్తించాడట. వాటి త్యాగాలను గుర్తు చేసే విధంగా బుద్ధ విగ్రహాలపై వాటిని తీర్చి దిద్దుతున్నారు. ఇది బుద్దుడికి సాయ పడిన నత్తల కథ..

Follow this link for more updates:- Bigtv

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×