BigTV English

Laughing buddha : లాఫింగ్ బుద్ధ అందరికీ ఎందుకు కలిసిరాదో తెలుసా….

Laughing buddha : లాఫింగ్ బుద్ధ అందరికీ ఎందుకు కలిసిరాదో తెలుసా….

Laughing buddha : ప్రతీ ఒక్కరి జీవితంలో అదృష్టాన్ని తీసుకొన్నే విగ్రహాలు, బొమ్మలు ఎన్నో ఉంటాయి . వాటిని తెలుకుని సరైన స్థానంలో ఉంచితే ఫలితం దక్కుతుంది. చైనీయుల వాస్తు ఫెంగ్ షుయు ప్రకారం లాఫింగ్ బుద్దను అదృష్ట వస్తువుగా భావిస్తుంటారు. ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంట్లో విగ్రహాలను ఉంచడం జీవితంలో అసమతుల్యతను అధిగమించడానికి, సామరస్యాన్ని తీసుకురావడానికి తోడ్పడతాయి. లాఫింగ్ బుద్ధలో చాలా రకాలు కూడా ఉన్నాయి. లావుగా ఉన్న బొడ్డుతో నవ్వుతూ ఉన్న విగ్రహం బట్టతలతో ఉంటుంది. మనం నివసించే ఇంట్లో కానీ, దుకాణంలో కానీ పెట్టుకుని లక్ కలిసి వస్తుందని నమ్మకం.


గౌతమ బుద్ధుని మిగిలిన శిష్యుల మాదిరిగా అతను ఉపన్యాసాలు చేయలేదని, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడట. అదే అతని సందేశమని చెబుతుంటారు. ఎక్కడికి వెళ్లినా జనం విపరీతంగా వచ్చేవారని ఆయనను కలిసేందుకు జనం వచ్చేవారట. అతని పనుల ద్వారా జ్ఞానం లభిస్తుందని, దీనికి ప్రబోధం అవసరం లేదని అనేవారు. అందుకే లాఫింగ్ బుద్ధ బొమ్మను ఇంటిలో లేదా షాపులో పెడితే శుభమని నమ్ముతారు. ఈవిగ్రహం ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోతుంది.

వ్యాపార దుకాణంలో కస్టమర్లు పెరిగి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. ఇంట్లో హాల్‌ లో పెడితే కుటుంబ సభ్యుల సమస్యలు ఉండవు. పడగ గదిలో పెడితే దంపతుల మధ్య కలహాలు తగ్గుతాయి. ఇలా ఈ విగ్రహాన్ని పెట్టే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా మారుతుంటాయి. అయితే లాఫింగ్‌ బుద్ధ విగ్రహాన్ని మనకు మనం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవచ్చా.. అంటే.. అవును.. పెట్టుకోవచ్చనే నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఈవిగ్రహాన్ని గిప్ట్ గా అడిగి మరీ ఇప్పించుకుంటారు. మనకు మనమే కొనుక్కోకూడదని కొందరు అంటారు. కానీ ఇందులో నిజం లేదు. అదృష్టం తెచ్చే వస్తువు కాబట్టి ఎవరైనా సొంతానికి కొనుకోవచ్చు..


లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టడానికి ఆగ్నేయ దిశ సరైనదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పిల్లలు చదువుకునే డెస్క్ లేదా బల్ల పైన ఈ విగ్రహం పెడతే వారికి చదువుపై కాన్సట్రేషన్ పెరుగుతుంది.విగ్రహాన్ని వంటగది, బాత్రూమ్ లేదా టాయిలెట్‌లో ఎప్పుడూ ఉంచకూడదు. అలాగే విగ్రహాన్ని నేరుగా కటిక నేలపై ఉంచకూడదు. కనీసం కంటికి కనిపించే స్థాయిలో విగ్రహాన్ని ఉంచాలి.

విగ్రహం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా పెట్టుకోవాలి. విగ్రహాన్ని ఎలక్ట్రికల్ అవుట్లెట్లు, మోటార్లు లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ ఉపకరణాల పైన ఉంచడం తగదు.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×