Big Stories

Shani Dhaiya: 2025లో ఈ రెండు రాశులపై శని ధైయా ప్రభావం.. శని ధైయా అంటే ఏమిటి ?

Shani Dhaiya 2025: ఏలి నాటి శని ఏడేళ్ల వరకు పోదు అని చెబతారు. శని దేవుడు ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందని అర్థం. పురాణాలు, హిందూ సంప్రదాయం ప్రకారం శని న్యాయ దేవుడు. ఆయనను ఆరాధిస్తే కష్టాల నుంచి ఉపశమనం పొందతారని చాలా మంది నమ్ముతారు. శని దేవుడి ఆశీర్వాదం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని చెబుతుంటారు.

- Advertisement -

శని సంచార సమయంలో నాలుగు లేదా ఎనిమిదో ఇంట్లో ఉంటే దానిని శని ధైయా ప్రభావం అంటారు. శని ధైయా మొత్తం రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. శని ధైయా అశుభం, బాధలను కలిగిస్తుందని చెబుతారు. జాతకాల్లో శని ప్రభావం శుభ, అశుభ ప్రభావాలను చూపుతుంది.

- Advertisement -

శని దేవుడు మనకు కర్మఫలాలను ఇస్తాడు. కొన్నిపనులను చేయడం వల్ల మనం శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ప్రతి శనివారం సాయంత్రం శని స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అంతే కాకుండా శనివారం రోజు శని దేవుడిని పూజించాలి. శనివారం మినుములు, నల్లని వస్త్రాలు, ఆవ నూన, బెల్లం మొదలైన వాటిని దానం చేయడం వల్ల శని దేవుడు శాంతించి మంచి ఫలితాలు అందిస్తాడని చెబుతారు.

శని చాలా నెమ్మదిగా తన స్థానాన్ని మార్చుకుంటాడు. శని ఏ రాశిలో అయినా దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు. అందుకే శని గ్రహం ఒక రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 30 ఏళ్లు పడుతుంది. శని మకరరాశిని వదిలి 2023 జనవరి 17 రోజున కుంభరాశిలోకి ప్రవేశించాడు. వచ్చే ఏడాది శని గ్రహం మార్చి 29, 2025న కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు.

 

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News