Big Stories

Bhadradri:రూ.116 భద్రాద్రి రాములోరి తలంబ్రాలు

Bhadradri:కోరిన కోర్కెలు తీర్చి భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలిచే దేవుడు సీతారామచంద్రస్వామి. ఆయన కొలువైన పుణ్యక్షేత్రం భద్రాచల క్షేత్రం . ఈ పుణ్యక్షేత్రంలో మరి కొద్ది రోజుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో మార్చి 30వ తేదీన సీతారాముల కళ్యాణం శ్రీరామ నవమి వేడుకను మరుసటి రోజు అనగా మార్చి 31వ తేదీ సీతారాముల సామ్రాజ పుష్కర పట్టాభిషేకం మహోత్సవం నిర్వహించేందుకు భద్రాచల దేవస్థానం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం కళ్లారా వీక్షించాలని, విశిష్టమైన కళ్యాణ తలంబ్రాలను ఇంటికి తెచ్చుకోవాలకునే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలను తీసుకురానుంది. రాములోరి తలంబ్రాలు కావాలనుకునే వారు రూ.116 చెల్లించి బుక్ చేసుకుంటే చాలు. తలంబ్రాల బుకింగ్‌ విధానం ఇప్పటికే ప్రారంభమైంది. భక్తుల నుంచి స్పందన కూడా వస్తోంది.

- Advertisement -

బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు వివిధరకాలుగా భక్తులకు సేవలు అందిస్తూ స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. గత రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సైతం భద్రాచల రాములవారికి సేవలందిస్తూ ముందుకు సాగుతుంది. బ్రహ్మోత్సవాల సమయంలో రాష్ట్ర నలుమూలల నుంచి భద్రాచలానికి బస్ సర్వీసులు పెంచడమే కాకుండా గత సంవత్సరం నుంచి సీతారాముల కళ్యాణం సందర్భంగా భద్రాద్రిలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాలను సైతం ఆర్టీసీ పార్సెల్ కార్గో సర్వీస్ ద్వారా భక్తులకు చేర వేస్తోంది

- Advertisement -

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలనే ఆలోచనతో తెలంగాణ ఆర్టీసీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తలపెట్టిం.ది భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా కళ్యాణంలో ఉపయోగిస్తున్నారు. వాటినే తర్వాత భక్తులకి అందిస్తుంటారు.

Tirupati:తిరుపతిలో నవమి సందడి

Naturalstar Nani : వెంక‌టేష్ మ‌హా – KGF 2 వివాదం.. రియాక్ట్ అయిన నాని

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News