Big Stories

Ashada Bonalu : ఆషాఢ బోనాలు ఎందుకంత ప్రత్యేకం.. అసలు బోనాలు రోజున ఏం చేస్తారు ?

Importace of Telangana Bonalu Festival : తెలంగాణ ప్రజలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో ఒకటి బోనాల పండగ. ఆషాఢమాసంలో వచ్చే ఈ పండుగ సమయంలో తెలంగాణ మొత్తం పోతరాజు నృత్యాలతో, హోరెత్తించే దప్పుల చప్పుళ్లతో, భక్తి పారవర్శ్యం వెల్లివిరుస్తుంది. స్త్రీలు తమ చెంపలకు పసుపు అద్దుకొని, నుదుటున కుంకుమ పెట్టుకొని బోనాలను నెత్తిన ధరించి ఎంతో ఉత్సాహంతో ఈ పండుగని జరుపుకుంటారు. ఇదొక సాంస్కృతిక సంబరం, ఈ పర్వదినాన బోనాలు అమ్మవారికి సమర్పించుకొని నిజమైన భక్తిశ్రద్దలతో మెలిగేవారికి ఆమె అనుగ్రహం దక్కుతుంది అని భక్తుల నమ్మకం.

- Advertisement -

బోనం అంటే భోజనం. నెలరోజుల పాటు జరిగే ఈ అపురూపమైన పర్వదినాల్లో గ్రామాలు పచ్చగా ఉండాలని నిస్వార్థంగా చేసుకునే పండుగ ఇది. కులమతాలకు అతీతంగా, తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతూ ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. ఆషాడ మాసంలోని మొదటి గురువారం రోజున గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబకు బోనాలు సమర్పించుకోవడం తో బోనాల పండుగ మొదలవుతుంది. చివరి ఆదివారం వరకు ప్రతీ రోజు విశేష పూజలు జరుగుతూ ఉంటాయి.

- Advertisement -

గోల్కొండ బోనాలు ముగిసిన తర్వాత వారం లో సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ఆ వారం మొత్తం బోనాలు జరుపుకుంటారు. ఆ తర్వాత లాల్‌ దర్వజా, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. నగరాల్లో పూర్తయిన తర్వాత జిల్లాలవారీగా, గ్రామాల వారీగా కూడా బోనాల పండుగ జరుపుకుంటారు. అయితే తెలంగాణ జాతి అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఈ బోనాల సంప్రదాయం ఎప్పటి నుండి మొదలైంది, దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Also Read : ఆషాఢ అమావాస్యలో ఈ రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి

బోనం అంటే భోజనం, భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని మట్టికుండలో , లేదా రాగి పాత్రలో వండుతారు. ఆ తర్వాత బోనాల కుండను వేప రెమ్మలతో, పసుపు కుంకుములతో అందంగా అలంకరించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి తీసుకెళ్తారు. ఈ ప్రక్రియ ని ఊరడి అని పిలుస్తారు. కేవలం అమ్మవారికి బోనాలు నైవేద్యంగా సమర్పించడం తో బోనాల సంబరం ముగుస్తుంది అనుకుంటే పొరపాటే. దాని తర్వాత ఇంకా చాలా ప్రక్రియ ఉంటుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి వెదురు కర్రలు, రంగుల కాగితాలతో చేసి అలంకరణలను సమర్పించుకుంటారు.

ఈ బోనాల పండుగ 600 సంవత్సరాల క్రితం పల్లవుల పరిపాలన కాలం నాటి నుండే సంప్రదాయం గా జరుగుతూ వస్తుంది. ఆరోజుల్లో శ్రీకృష్ణ దేవరాయులవారు ఏడుకోట్ల నవాడట్టి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించుకున్నారు అనేది చరిత్ర చెప్తుంది. అదే విధంగా 1676 వ సంవత్సరం లో సర్వాయి పాపన్న కరీంనగర్ లోని హస్నాబాద్ లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారట.

ఇదంతా పక్కన పెడితే 1869 వ సంవత్సరం లో జంటనగరాల్లో ప్లేగు వ్యాధి చేసిన విధ్వంసం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో వేలమందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. ఈ మహమ్మారి నుండి తమని రక్షించమని ఆరోజుల్లో ప్రజలు గ్రామదేవతలు వేడుకున్నారు. దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం బోనాలను సమర్పించుకున్నారు. కాకతీయుల కాలం నుండి గోల్కొండ లో సంప్రదాయంగా ఈ బోనాల పండుగ జరుగుతూనే ఉంది. ఆ తర్వాత కులీకుతుబ్‌ షా బాదుషాల కాలం లో కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు జంటనగరాల రూపురేఖలు మారిపోయాయి. నగరాల్లో పచ్చదనం తగ్గుతూ వస్తుంది. అనాదిగా వస్తున్నా కొన్ని పండుగలు ఉనికిని కోల్పోతున్న ఈ రోజుల్లో నగరవాసులు భక్తి శ్రద్దలతో జరుపుకునే ఏకైక పండుగ బోనాల పండుగ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News