Big Stories

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని పురోగతి..డబ్బే డబ్బు

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. 12 రాశుల్లో ఏ రాశి వారికి శుభప్రదం..ఏ రాశి వారికి అదృష్టదాయంగా ఉంటుందో తెలుసుకుందాం.

- Advertisement -

మేషం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సరైన ఆలోచనతో అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి ఊహించని లాభాలు వస్తాయి. ఇతరులతో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఉద్యోగులయితే ఊహించని ధన లాభాలు పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధించాలి.

- Advertisement -

వృషభం:
వృషభ రాశి వారికి ఆశాజనకంగా ఉంది. కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఊహించని ఆర్థిక లాభాలను అందుకుంటారు. వ్యాపారులు పెట్టుబడి పెట్టేముందు ఆచితూచి ఆలోచించాలి. శివారాధన మంచిది.

మిథునం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి గౌరవం పొందుతారు. కొత్త కార్యక్రమాలు మొదలు పెడతారు. అన్ని రంగాల వారికి లాభాలతో పాటు అప్పు మాఫీ కావడానికి అవకాశం ఉంది. ఇష్టదైవాన్ని పూజించాలి.

కర్కాటకం:
ఈ రాశి వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి వారిని సందర్శిస్తే మంచిది.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఆలోచించాలి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఇతరులతో గొడవలు పడే అవకాశం ఉంటుంది. రామరక్షా స్తోత్రం చదవాలి.

కన్య:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని లాభాలు పొందుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఇతరుల నుంచి సహకారం ఉంటుంది. కీలక సమయాల్లో మీ ఆలోచనే విజయాలకు కారణమవుతుంది. గౌరవం పొందుతారు. ఆదిత్య హృదయం పఠిస్తే శుభదాయకం.

తుల:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. ధర్మసిద్ది ఉంది. ఉద్యోగులకు ప్రత్యేకంగా ఉంటుంది. మీ నైపుణ్యంతో ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు డబ్బే డబ్బు. వ్యాపారాలను విస్తరిస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. శివారాధన శ్రేయస్కరం.

వృశ్చికం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి విజయాలు సాధిస్తారు. వ్యాపారాల్లో ఉహించని సవాళ్లు ఎదురుకావొచ్చు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతారు. తెలివితేటలతో కష్టం నుంచి బయటపడుతారు. దైవబలంతో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకోవాలి.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమతో కూడిన విజయాలు ఉంటాయి. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి.

మకరం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. మనోధైర్యం కోల్పోవద్దు. రాజకీయ నాయకులకు అదృష్టం వరిస్తుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన ఉండాలి.

కుంభం:
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా లాభం పొందుతారు. సమస్యలు ఎదురైనా పోరాడి విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఇబ్బంది పెట్టే వారికి దూరంగా ఉండడం మంచిది. ఇష్టదైవారాధన శుభకరం.

మీనం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలి. అనారోగ్యానికి గుర్యయ్యే అవకాశాలు ఉన్నాయి. బాధ కలిగించే సంఘటనకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News