Big Stories

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అద్భుతం.. కెరీర్‌లో దూసుకెళ్తారు

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..12 రాశుల్లో ఏ రాశి ఫలం ఎలా ఉంది. ఎవరికి అనుకూలం.ఆర్థికంగా లబ్ధి పొందుతారా వంటి విషయాలను జ్యోతిషులు ఏమని వెల్లడించారో తెలుసుకుందాం.

- Advertisement -

మేషం:
మేష రాశివారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను మరింత ఉత్సాహంతో చేస్తే విజయం వరిస్తుంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాల్లో అనవసర ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ఆనంద సంఘటనలు వింటారు. ఆదిత్య హృదయం చదివితే బాగుంటుంది.

- Advertisement -

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలం. మనోధైర్యం కోల్పోవద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా లాభం పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఇష్ట దేవతారాధన శుభకరం.

మిథునం:
ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది. ప్రోత్సాహకరమైన వాతావరణం లభిస్తుంది. బుంధువులతో కీలక విషయాలు చర్చిస్తారు.వృత్తి పరంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శివారాధన ఉంటే మంచిది.

కర్కాటకం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆకస్మికంగా ధనలాభాలు ఉండవచ్చు. శని ధ్యానం చేయాలి.

సింహం:
సింహ రాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అర్ధలాభం పొందుతారు. కీలక సమయాల్లో ఆచితూచి నడుచుకోవాలి. దుర్గాస్తోత్రం చదివితే మంచిది.

కన్య:
ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారు కెరీర్‌లో దూసుకెళ్తారు. కీలక నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు. ప్రారంభించిన ప్రతి పనుల్లో విజయం ఉంటుంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్ట దేవతారాధన మంచిది.

తుల:
ఈ రాశి వారికి అనుకూలం. ఉద్యోగపరంగా ప్రమోషన్ ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయం వృద్ది చెందుతుంది. కుటంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కుటంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఆంజనేయ స్వామి వారిని సందర్శించాలి.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలం. ఒత్తిడిని జయించి ముందుకెళ్లాలి. ఆరోగ్యంగా ఉంటారు. ఇతరుల నుంచి సహకారం ఉంటుంది. వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. ధనానికి లోటు ఉండదు. కుటుంబ సలహాలు తీసుకుంటే మంచిది. వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తే మంచిది.

ధనుస్సు:
ఈ రాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. విశ్రాంతి అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కొన్ని పనులను వాయిదా వేయడమే మంచిది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

మకరం:
మకరరాశి వారికి మిశ్రమ ఫలితాలు. సమాజంలో కీర్తి ప్రతిష్టతలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఖర్చుల విషయంలో పెరగవచ్చు. లక్ష్యం వైపు దృష్టి సారించాలి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన అవసరం.

కుంభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకొని సక్సెస్ పొందుతారు. అన్ని రంగాల వారికి పని భారం పెరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.

మీనం:
మీన రాశి వారికి అనుకూలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభవార్త వింటారు. ఆర్థికంగా లాభం పొందుతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. శుభ కార్యాక్రమాల్లో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News