Big Stories

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగాల్లో పదోన్నతి..!

June 28th Horoscope: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. 12 రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? ఏ రాశి వారికి సమస్యలు ఉన్నాయి? వంటి విషయాలపై జ్యోతిషులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

- Advertisement -

మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్థికంగా లాభం పొందుతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మనస్సును అనవసర విషయాలపై ఆలోచించకుండా చూసుకోవాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

- Advertisement -

వృషభం:
ఈ రాశి వారికి మంచి కాలం. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. అధికారం, గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. ఇష్టదేవతారాధన శుభకరం.

మిథునం:
ఈ రాశి వారికి అదృష్టకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఫర్వాలేదు. అన్ని రంగాల్లో చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. పెద్దల సలహాలు పనిచేస్తాయి. ఆర్థికపరంగా చేసే లావాదేవీలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.గోసేవ మంచిది.

Also Read: Venus Transit in July: 24 రోజుల పాటు కర్కాటక రాశిలో శుక్రుడు.. ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం!

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలం. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధువులను కలుస్తారు. అన్ని పనులు విజయవంతం అవుతాయి. సంపద పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. కోపాని అదుపులో పెట్టుకోవాలి. గణపతి ప్రార్థన శ్రేయస్కరం.

కన్య:
ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైన పట్టుదలతో విజయం సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో జాగ్రత్తలు అవసరం. వృత్తి, వ్యాపారాల్లో విజయం వరిస్తుంది. సమాజంలో గౌరవం పొందుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవారాధన శుభకరం.

Also Read: Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అద్భుతం.. కెరీర్‌లో దూసుకెళ్తారు

తుల:
తుల రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఇతరుల అభిప్రాయాలు ప్రభావితం చేస్తాయి. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వేంకటేశ్వర సందర్శనం మంచిది.

వృశ్చికం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. శారీర శ్రమ పెరుగుతుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. శ్రీరామ నామస్మరణం మంచిది.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగచ వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇతరులతో సానుకూలంగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. శని ధ్యానం చేస్తే మంచిది.

Also Read: Rahu Transit July Horoscope: జూలై 8వ తేదీన అద్భుతం.. ఈ 3 రాశులపై రాహువు అనుగ్రహం

మకరం:
ఈ రాశి వారికి అనుకూలం. ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఆదాయానికి తగిన వ్యయం ఉంటుంది. మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాల్లో పోటీదారులను అధిగమిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. దైవారాధన మానవద్దు.

కుంభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. హనుమాత్ ఆరాధన శుభప్రదం

మీనం:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. మీ ప్రతిభకు ప్రశంసలు వస్తాయి. సహనంతో ఉండాలి. కోపాని అదుపులో పెట్టుకోవాలి. ఇతరుల నుంచి మనశ్శాంతి లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ఉత్తమం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News