Big Stories

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు అధికం.. ఇలా చేస్తే ఉపశమనం పొందుతారు..!

June 27th Horoscope: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. 12 రాశుల్లో ఏ రాశి వారికి అత్యంత అనుకూలం, ఏ రాశి వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం, కీలక సమయాల్లో ఎలా వ్యవహరించాలనే విషయాలను జ్యోతిషులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

- Advertisement -

మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల సూచనలు ఫలిస్తాయి. కీలక నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. జీవిత భాగస్వామితో ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. లేదంటే ప్రేమను కోల్పోయ్యే ప్రమాదం ఉంది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి.

- Advertisement -

వృషభం:
ఈ రాశి వారికి శుభఫలితాలు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో ఆర్థికంగా లాభం పొందుతారు. ఆత్మీయులు సలహాలు అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. గణపతి ఆరాధన మంచిది.

మిథునం:
మిథునం రాశి వారికి మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగితే తిరుగులేని విజయం పొందుతారు. కొన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని మరవకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సమయం సద్వినియోగం చేసుకోవాలి. చంద్ర ధ్యానం శుభప్రదం.

Also Read: Mars Nakshatra Transit: భరణి నక్షత్రంలో కుజుడి సంచారం.. ఈ రాశుల వారికి అదృష్టం!

కర్కాటకం:
ఈ రాశి వారికి ఇతరుల సహకారం ఉంటుంది. కీలక సమయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. మీ జీవిత భాగస్వామికి గొడవలు జరిగే అవకాశం. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. అనవసర ఖర్చులకు దూరం ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. నవగ్రహ ఆరాధన చేయాలి.

సింహం:
ఈ రాశి వారు అనవసర ఖర్చులు చేస్తారు. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కీలక సమయాల్లో ఆచితూచిగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. బంధుమిత్రుల సలహాలు తీసుకోండి. ఆంజనేయ స్తోత్రం చదవాలి.

కన్య:
కన్య రాశి వారికి అనుకూలం. సమాజంలో ప్రశంసలు పొందుతారు. కోపాన్ని అధిగమించాలి. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండాలి. ఆర్థికంగా లాభం పొందుతారు. కీలక వ్యవహారాల్లో ఆచితూచిగా వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి.

Also Read: Ashtadasha Shakti Peethas: అష్టాదశ శక్తి పీఠాలలో మొదటి శక్తి పీఠం.. ఈ అమ్మవారి పేరు, ప్రాముఖ్యత తెలుసా..

తుల:
ఈ రాశి వారికి వ్యాపారాల్లో నష్టాలు ఎదురవుతాయి. ఆందోళన చెందకుండా పట్టుదలతో పనిచేయాలి. తోటివారి సలహాలు తీసుకుంటే ఫలితాలు నెరవేరుతాయి. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అధికారులతో పరిచయాలు పెరుగుతాయి. శ్రీరామ నామాన్ని జపించాలి.

వృశ్చికం:
ఈ రాశి వారికి అత్యంత సానుకూలంగా ఉంది. మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులపై జాగ్రత్తలు అవసరం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కోరుకున్న ఫలితాలు పొందుతారు. శివారాధన చేయాలి.

ధనుస్సు:
ఈ రాశి వారికి ఆర్థికంగా శుభఫలితాలు. కీలక పనుల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం పొందుతారు. కుటుంబంతో సమయం గడపండి. ఎవరినీ సంప్రదించకుండా పెట్టుబడి పెట్టవద్దు.శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా ఉంటారు. ఇష్టదైవారాధన శుభ ప్రదం.

Also Read: Shani-Jupiter Horoscope: శని, గురు గ్రహాల మార్పు.. వీరి జీవితంలో డబ్బు, సంతోషానికి కోదువ లేదు.

మకరం:
ఈ రాశి వారికి కీలక వ్యవహారాల్లో శోధన అవసరం. వ్యాపారంలో ఇతరుల సలహాలు, సూచనలు ముఖ్యం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనుల్లో భయాందోళనకు గురికావొద్దు. శని ధ్యానం చేయాలి.

కుంభం:
కుంభ రాశి వారు ఊహించని ఫలితాలు పొందుతారు. ప్రారంభించిన పనులను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తుపై అవగాహనతో ముందుకు వెళ్లాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా నష్టపోయినా వెంటనే పుంజుకుంటారు. ఆంజనేయ ఆరాధన చేయాలి.

మీనం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఎక్కువ ఖర్చులు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు బాధిస్తాయి. ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దు. లింగాష్టకం చదివితే మంచిది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News