Big Stories

Murudeswara Swamy : కందుక పర్వతంపై మురుడేశ్వరుడు.. ఆ ఇతిహాసమేంటో తెలుసా ?

Murudeswara Swamy Temple History : భారతదేశంలో జ్యోతిర్లింగాలతో పాటు.. భక్తుల పూజలందుకుంటోన్న శైవక్షేత్రాలెన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి మురుడేశ్వర లోని శివాలయం. ఉత్తర కన్నడ జిల్లా భట్కల్ తాలూకాలోని పట్టణంలో అరేబియా సముద్రానికి ఒడ్డున ఉంది ఈ పుణ్యక్షేత్రం. ప్రపంచంలోనే అతిపొడవైన శివుని విగ్రహం.. భక్తులను ఆకట్టుకుంటోంది. మురుడేశ్వర ఆలయం వెనుక ఓ చరిత్ర ఉంది. రావణాసురుడు ఆత్మలింగం కోసం అంకుఠితమైన శివతపస్సు చేసి ఆ లింగాన్ని పొందుతాడు కదా. ఆ ఆత్మలింగాన్ని భూలోకానికి తీసుకొస్తాడు.

- Advertisement -

అయితే.. శివుడు ఆత్మలింగాన్నిచ్చే ముందు.. దానిని భూమ్మీద పెట్టరాదని, పెడితే అది స్థాపితమై.. అక్కడే ఉండిపోతుందని చెబుతాడు శివుడు. ఆ లింగాన్ని రావణాసురుడు లంకలో ప్రతిష్టిస్తే.. ప్రపంచంలో ప్రతికూల చర్యలు జరుగుతాయని గ్రహించిన దేవతలంతా.. ఆ కార్యానికి ఆంటంకం కలిగించాలని విష్ణుమూర్తిని వేడుకుంటారు. తన మాయాశక్తితో విష్ణుమూర్తి.. సూర్యాస్తమయం అయ్యేలా చేస్తాడు. ఇంతలో నారదుడు వినాయకుడికి విషయం చెప్పగా.. ఆయన భూలోకానికి వెళ్తాడు.

- Advertisement -

సూర్యాస్తమయం కావడంతో.. సంధ్య వార్చుకోవాలని చూస్తాడు. చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని నేలపై పెడితే అది స్థాపితమవుతుందని గుర్తొచ్చి.. సమీపంలో ఒక పిల్లాడు కనిపిస్తే.. ఆత్మలింగాన్ని అతని చేతిలో పెడతాడు రావణుడు. సంధ్యవార్చుకుని వచ్చేవరకూ లింగాన్ని కింద పెట్టొద్దని చెబుతాడు. తాను మోయలేనపుడు మూడుసార్లు పిలుస్తానని, ఆ తర్వాత లింగాన్ని కింద పెట్టేస్తానంటాడు. సరే అని చెప్పి సంధ్యవార్చుకునేందుకు వెళ్తాడు రావణుడు.

Also Read : మీ కలలో ఇలా జరిగిందా.. అయితే మీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి

ఆత్మలింగం లంకలో ప్రతిష్టించకుండా చేయాలి కాబట్టి.. పిల్లాడుగా వెళ్లిన వినాయకుడు తాను మోయలేకపోతున్నానంటూ శివలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. దీంతో ఆత్మలింగం అక్కడే భూస్థాపితం. ఆ ప్రాంతమే గోకర్ణ. ఇంతలో విష్ణుమూర్తి సూర్యాస్తమయ మాయను తొలగించడంతో.. రావణుడికి కోపమొచ్చి.. ఆత్మలింగం పై భాగాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. ఆత్మలింగంపై కవచాన్ని విసిరేస్తే గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలోని సజ్జేశ్వర ప్రాంతంలో పడుతుంది. లింగం పై నున్న మూతను విసరేస్తే.. గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలోనున్న గుణేశ్వరలో పడుతుంది.

లింగపైన ఉన్న వస్త్రాన్ని విసిరేస్తే.. అది కందుక పర్వతంపై ఉన్న మృదేశ్వరలో పడుతుంది. అదే కాలక్రమేణా మురుడేశ్వరగా పేరొందింది. ఆలయానికి మూడు వైపులా అరేబియా సముద్రం ఉంటుంది. గాలిగోపురం 20 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం వెనుక మురుడేశ్వర కోట ఉంటుంది. ప్రధాన ఆకర్షణగా ఉన్న శివుడి విగ్రహం ఎత్తు 123 అడుగులు. శివమొగ్గకు చెందిన కాశీనాథ్, కొడుకు శ్రీధర్ సహా శిల్పులు కలిసి విగ్రహాన్ని కోటిరూపాయల ఖర్చుతో చెక్కింది. విగ్రహంపై సూర్యరశ్మి పడినపుడు అది మెరుస్తూ కనిపిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News