Big Stories

Mars Nakshatra Transit: భరణి నక్షత్రంలో కుజుడి సంచారం.. ఈ రాశుల వారికి అదృష్టం!

Mars Transit in Bharani Nakshatra: జ్యోతిషశాస్త్రంలో రాశి నక్షత్ర మార్పులు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. నవగ్రహాలు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి మారుతున్నప్పుడు ఇవి మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. భరణి నక్షత్రంలో అంగారకుడు సంచరించనున్నాడు. జూన్ 19న అంగారకుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు. శుక్రుడు, అంగారకుడి సంచారం వల్ల నాలుగు రాశుల వారి జీవితంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.

- Advertisement -

భరణి నక్షత్రం చాలా అన్ని రాశుల్లో శుభప్రదమైనదిగా చెబుతారు. కుటుంబ బంధాలను బలోపేతం చేసేందుకు సహాయపడే శుభ నక్షత్రంగా దీనిని పరిగణిస్తారు. భరణి నక్షత్రం రెండో పాదం సృజనాత్మకత, ఇంద్రియాలకు సంబంధించినదిగా పండితులు చెబుతుంటారు. భరణి నక్షత్రంలో సంచరించడం వల్ల కుజుడు, శుక్రుడు అనుకూల ఫలితాలను ఇవ్వనున్నారు. కుజుడు, శుక్రుడు ఈ నక్షత్రంలో సంచరించడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.

- Advertisement -

అంగారకుడిని శౌర్యానికి కారకుడిగా అభివర్ణించారు. మేష రాశి, అంగారక గ్రహం మూల త్రికోణ రాశి. మొదటి ఎనిమిది గ్రహాలకు అంగారకుడు అధిపతి. కుజుడు శుభ స్థానంలో ఉంటే అధికారం, గౌరవం ,గొప్ప ప్రయోజనాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. భరణి నక్షత్రంలో కుజుడి ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
మేష రాశిలో ప్రస్తుతం కుజుడు సంచరిస్తున్నాడు. భరణి నక్షత్రంలో కుజుడు సంచరించడం వల్ల వీరి కెరీర్‌లో పురోగతి లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వం బాగా మెరుగుపడుతుంది. ఉన్నత చదువులు చదివేందుకు విదేశాలకు వెళ్లాలనే మీ కల సాకారం అవుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. మానసికంగా, ధృడంగా ఉండండి. కుటుంబ కలహాలు పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి. మీ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
వృషభ రాశి:
కుజుడి నక్షత్ర మార్పు కారణంగా వృషభ రాశి వారికి మంచి రోజులు రానున్నాయి. మీ ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. గతంలో మీరు పోగొట్టుకున్న డబ్బు తిరిగి లభిస్తుంది. ఉద్యోగస్తులు, ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు. మీ కెరీర్‌లో పురోగతి లభిస్తుంది. భార్యభర్తల మధ్య ప్రేమ, అభిమానం పెరుగుతాయి. అంతే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
తులా రాశి:
భరణి నక్షత్రంలో కుజుడి సంచారం ప్రభావంతో తులా రాశి వారు గొప్ప ప్రయోజనాలు పొందుతారు. మీ జీవన శైలి మెరుగుపడుతుంది. డబ్బు ఎక్కువగా సంపాదించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా పొదుపు కూడా చేస్తారు. ఆస్తి కొనుగోలు చేయాలన్న మీ కల నెరవేరుతుంది. సమాజంలో మీపట్ల గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు కూడా పొందుతారు. మీరు పనిచేస్తున్న స్థలంలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మికత, మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

Also Read: ఈ 4 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త.. జూలైలో మీకు అన్నీ అశుభాలే

వృశ్చిక రాశి:
అంగారకుడి నక్షత్ర మార్పు కారణంగా వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. మీరు వ్యాపారంలో లాభాలు పొందడంతో పాటు చేసిన పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కూడా స్థిరపడే అవకాశాలున్నాయి. కెరీర్‌లో గొప్ప అవకాశాలను పొందుతారు. ఉద్యోగం మారేందుకు ఇది అనుకూల సమయం. తల్లిదండ్రులతో మీ బంధం మరింత పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోయే సమయమిది. పెళ్లికాని వారికి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News