Big Stories

Sunday Fasting: ఆదివారం ఇలా చేస్తే మీకు అదృష్టం వరించినట్లే..

Sunday Fasting: హిందూ మతంలో వారంలోని ప్రతీ రోజుకు ఓ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతీ వారాన్ని ఏదో ఒక దేవుడికి అంకితం చేయడింది. ఈ తరుణంలో ఆదివారం రోజున సూర్యభగవానుడి పూజించడం ఆనవాయితీ. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడికి గ్రహాల రాజు అని కూడా పేరు ఉంది. సూర్యుడిని పూజించడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. అంతేకాదు అదృష్టం కూడా వరించి ధనవంతులు అయ్యే అవకాశాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది. అయితే దీని కోసం ఏం చేయాలో తెలుసుకుందాం.

- Advertisement -

ఆదివారం ఉపవాసం..

- Advertisement -

ఆదివారం రోజున ఉపవాసం ఉండడం వల్ల సూర్యుడి అనుగ్రహం పొందవచ్చు. దీని కోసం ఆదివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. అనంతరం పూజ గదిని శుభ్రం చేసి ఎర్రటి దుప్పటిపై కూర్చుని సూర్యుడిని పూజించాలి. బీజ్ మంత్రం జపిస్తూ జపమాలతో ఐదు సార్లు జపించాలి. ఇలా చేస్తూ ఆదివారం నాడు ఉపవాసం ఉండాలి. అంతేకాదు ఆదిత్య హృదయ స్తోత్రం కూడా జపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

సూర్యుడిని పూజించే సమయంలో ధూపం, పాలు, ఆర్ఘ్యం వంటివి సమర్పించాలి. పూజ సమయంలో ఎర్ర చందనం సమర్పించింది. నుదుటిపై ధరించాలి. అనంతరం ప్రసాదాన్ని కూడా సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేసిన అనంతరం ఉపవాస దీక్ష పాటించాలి. ఈ ఉపవాసంలో గోధుమ రొట్టె లేదా బెల్లం కలిపి తినాలి. దీనిలో ఉప్పును ఉపయోగించకూడదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News