Big Stories

Ashadha Masam: ఆషాఢ మాసంలో కొత్త కోడళ్లు ఎందుకు అత్తవారింట్లో ఉండకూడదంటారో తెలుసా ?

Ashadha Masam: తెలుగు పంచాంగం ప్రకారం ఆషాడ మాసం ప్రతీ ఏటా నాలుగవ నెలలో వస్తుంది. అయితే ఈ నెల అంటే జూలైలో ఆషాడ మాసం ప్రారంభం కానుంది. హిందువుల నమ్మకం ప్రకారం ఆషాడ మాసం చాలా ప్రత్యేకమైనది. ఆషాడ మాసంలో ఎన్నో శుభకార్యాలు ఉంటాయి. అంతేకాదు విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల కరుణించి వరాలు కురిపిస్తారని కూడా భక్తులు నమ్ముతారు. అయితే ఈ ఆషాడ మాసంలో ఇవే కాకుండా మరో ప్రత్యేక ఉంటుంది. హిందు సంప్రదాయం ప్రకారం ఆషాడ మాసంలో అత్తాకోడళ్లు కలిసి ఉండకూడదని పూర్వీకుల నుంచి ఈ ఆచారం వస్తోంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన కోడలు, అత్తగారింట్లో ఉండకూడది ఆషాడ మాసం అయిపోయే వరకు అంటే నెల రోజుల పాటు తన పుట్టింట్లోనే ఉండాలని ఓ నమ్మకం.

- Advertisement -

ఆషాడంలో అంటే సంస్కృత పదం. దీనిని ఆది అంటారు. ఆది అంటే శక్తి అని దీని అర్థం. అయితే ఆషాడ మాసంలో దేవతనలు పూజించడానికి ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ తరుణంలో ఎన్నో వ్రతాలు, నోములు, పూజలు, ఉపవాసాలు పాటిస్తారు. అంతే కాదు ముఖ్యంగా ఈ ఏడాది ఆషాడ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో చాలా యోగాలు ఏర్పడబోతున్నాయి. అయితే ఆషాడమాసంలో అత్తాకోడళ్లు కలవకూడదనే ఓ ఆనవాయితీ వస్తూ ఉంది. అయితే అసలు దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి.

- Advertisement -

తాజాగా చాగంటి కోటేశ్వరరావు గారి చెప్పిన వ్యాఖ్యల ప్రకారం. ‘ఆషాడ మాసంలో అత్తాకోడళ్లు కలిసి ఉండకూడదు అని అంటారు. ఇలా చేయడం వల్ల భార్యభర్తల మధ్య ఎడబాటు ఏర్పడుతుంది. ఈ ఎడబాటు కారణంగా వారిద్దరు చింతిస్తుంటారు. అయితే అసలు ఆషాడమాసంలో అత్తగారింటికి వెళ్లకూడదు అంటే అది కేవలం వ్యవసాయ ప్రదానమైన అత్తగారి కుటుంబంలో మాత్రమే కోడలును పంపిచకూడదు. ఎందుకంటే భర్త వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఆషాడ మాసంలోనే వర్షాలు కురుస్తాయి కాబట్టి నాగలి పట్టుకుని పొలానికి వెళ్లి దున్ని విత్తనం వేయాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో వర్షం కారణంగా భార్యభర్తలు ఇద్దరు ఇంట్లోనే కలిసి ఉంటే వ్యవసాయం చేయడం కష్టం అవుతుంది. దీంతో అత్తాకోడలు మధ్య గోడవలు ఏర్పడతాయని అందువల్ల కొత్తకోడలు అత్తవారింట్లో ఉంచకూదడని, పుట్టింటికి పంపుతారు అని చాగంటి గారు చెప్పుకొచ్చారు.

మరికొన్ని కథనాల ప్రకారం ఆషాడ మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని అందువల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు ఉండవని నమ్ముతారు. అందువల్ల కొత్తకోడలు అత్తగారింట్లో ఉండకుండా పుట్టింటికి పంపుతారు. మరోవైపు ఆషాడమాసంలో భార్యభర్తల కలయిక కారణంగా గర్భం దాల్చితే వేసవికాలంలో ప్రసవం జరుగుతుంది. ఇలా జరిగితే తల్లీ, బిడ్డకు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని కూడా మరికొంత మంది చెబుతుంటారు. అందువల్ల ఇలాంటి సంప్రదాయ పేరుతో భార్యభర్తలను ఆషాడమాసంలో దూరంగా ఉంచుతారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News