Big Stories

Gruhapravesam : ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే గృహప్రవేశం చేస్తే ఏమవుతుందో తెలుసా…..

Gruhapravesam : ఎంత కష్టపడి అయినా ఒక ఇంటిని నిర్మించుకోవాలని జీవితంలో ప్రతీ ఒక్కరు ఆశపడుతుంటారు. సొంతింటి కల వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. అలాంటి వారిలో కొంతమందికి మాత్రమే సొంతింటి వారవుతుంటారు. ఆశలతో కట్టించుకున్న ఇల్లు గృహప్రవేశాన్ని కొందరు హడావుడిగా చేసేస్తుంటారు. ముహుర్తం కుదిరితే కొంతమంది గృహ నిర్మాణం మధ్యలో ఉండగానే గృహ ప్రవేశం చేస్తూ ఉంటారు. నిర్మాణం పూర్తయాక పూర్తిగా సర్దుకుంటారు.
కాని ఇల్లు గృహప్రవేశానికి అర్హత ఇంటి నిర్మాణం పూర్తి చేయడమే అసలు విషయం. ఇల్లు పనులు పూర్తికాక ముందే ముహూర్తాలు లేవని , ఇంట్లో వాళ్లకి ఒంట్లో బాగోడం లేదని…ఇంకో కారణంతోనే గృహ ప్రవేశం తగదని శాస్త్రం చెబుతోంది.

- Advertisement -

ఉన్న అద్దె ఇల్లు భారం పెరుగుతోందని , కొత్త ఇంట్లో చేరిపోయి మిగిలిన పనులు చేసుకోవచ్చని కొందరు అనుకుని పని కానిచ్చేస్తుంటారు. కాని గృహ నిర్మాణం పూర్తయిన తర్వాతే ప్రవేశం చేయడం అనేది సరైన పద్దతి అని పండితులు చెబుతున్నారు. కారణం ఇల్లు కట్టే టప్పుడు ఒక్కోసారి కొన్ని దోషాలతో సాగుతూ ఉంటుంది. శంకుస్థాపన చేసి పూజ తర్వాతే పనులు మొదలుపెట్టినా దోషాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. శంకుస్థాపన అనేది ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని దేవుడ్ని కోరుకుంటూ చేసే ప్రక్రియ. మన అనుకున్న ఇంటిని అనుకున్నట్టు జరిగేలా చూడాలని దేవతల అనుగ్రహం పూజలు చేస్తుంటాం.

- Advertisement -

ఇంటి నిర్మాణం చేసే కూలీలకి దోషాలు, మైల కానీ, వాస్తు దోషాలు కానీ ఉండే సందర్భాలున్నాయి. కాబట్టి ఇంటి నిర్మాణం పూర్తి కాకుండా గృహప్రవేశం చేస్తే ఆ దోషాలతో ఇంటి యజమాని జీవనం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. నిర్మాణం పూర్తి కాని ఇంట్లో ఉండేది రాక్షసులు మాత్రమే. అకాల మరణం చెందిన వారు పాడబడ్డ ఇళ్లలోను, గృహ నిర్మాణం సాగుతున్న ఇళ్లలోను అతి నిదానంగా నిర్మాణం ఇళ్లలోకి తిష్టవేస్తారట. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇళ్లలోకి చేరితో కలిగేది నష్టమే. కాబట్టి ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని గృహప్రవేశం చేయడం ఉత్తమం అని పండితులు సూచిస్తున్నారు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News