Big Stories

Ashtadasha Shakti Peethas: అష్టాదశ శక్తి పీఠాలలో మొదటి శక్తి పీఠం.. ఈ అమ్మవారి పేరు, ప్రాముఖ్యత తెలుసా..

Ashtadasha Shakti Peethas: దుర్గాదేవి అష్టాదశ శక్తి పీఠాలలో భాగంగా 108 శక్తి పీఠాలలో కొలువు దీరిందని పురాణాల్లో ప్రస్తావన ఉంది. అందులో ముఖ్యంగా మధ్య యుగంలో ప్రధానంగా 18 అష్టాదశ మహా పీఠాలు ఉన్నాయని హిందూ గ్రంథాలలో చెప్పబడింది. వివిధ ప్రదేశాలలో ఉండే శక్తి పీఠాలు దుర్గాదేవిని ఆరాధించడానికి అంకితం చేయబడ్డాయి. ఒక్కో చోట ఒక్కో పుణ్య క్షేత్రంగా ఈ శక్తి పీఠాలు కొలువుదీరాయి. వీటి గురించి ఇతిహాసాల్లో వివరంగా చెప్పబడింది.

- Advertisement -

సతీదేవి శరీరంతో విశ్వమంతా శివుడి పర్యటన

- Advertisement -

సతీదేవి మరణంతో ఈ శక్తి పీఠాలు ముడిపడి ఉంటాయని పురాణాలు చెబుతాయి. శివుడు సతీదేవీ శరీరాన్ని తీసుకుని విశ్వమంతా పర్యటించాడు. సతీదేవితో కలిసి తాను గడిపిన క్షణాలను నెమరవేసుకున్నాడని, వాటి నుంచి శివుడికి విముక్తి అందించడం కోసం విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని 10 భాగాలుగా విభజిస్తాడు. సతీదేవి శరీరం నుంచి భూమి మీద పడిన భాగాలనే అష్టాదశ పీఠాలు అంటారు. వీటిని పవిత్ర ప్రదేశాలుగా ప్రజలు కొలుస్తారు.

ఆలయాన్ని నిర్మించిన రావణుడు..

అష్టాదశ పీఠాలలో మొదటి పీఠం శ్రీలంకలోని త్రింకోమలైలో ఉంది. ఇక్కడ కొలువుదీరిన అమ్మవారిని శ్రీ శాంకరి దేవి అని పిలుస్తారు. సతదేవి గజ్జ ఈ స్థలంలో పడిపోయిందని, అందువల్ల ఇక్కడ శాంకరీ దేవి పుణ్య క్షేత్రం ఏర్పడిందని నమ్ముతారు. ఈ ఆలయంలో కొలువుదీరిని శివుడిని త్రికోణేశ్వరుడిగా పూజిస్తారు. ఈ ఆలయాన్ని రావణుడు నిర్మించాడని స్థలపురాణాల్లో ప్రస్తావన ఉంది. అయితే ఈ ఆలయాన్ని పోర్చుగీసు వారు దండెత్తిన సమయంలో కూల్చివేశారని దీనికి సంబంధించిన కేవలం ఒకే ఒక స్తంభం ఉండడం ద్వారా దీనిని నూతనంగా నిర్మించిన ఆలయంలో చేర్చారు.

శాంకరీ దేవి ఆలయాన్ని ఉదయం 6 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు. అయితే భారతదేశంలో నివసించే వారికి ఈ శక్తి పీఠాన్ని సందర్శించాలంటే వీసా అవసరం. కానీ ఇండియన్ రైల్వే టూరిజం కార్పొరేషన్ దీని కోసం స్పెషల్ ప్యాకేజీని కూడా అందుబాటులో ఉంచింది. ఒక వ్యక్తికి రూ. 43,836 లకు శాంకరి దేవి పీఠంతో పాటు శ్రీ రాముని పవిత్ర స్థలాలను సందర్శించేలా ఏర్పాట్లు చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News