Big Stories

Rudraksha: రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?

Benefits of Wearing Rudraksha: శివుడి కన్నీటి బిందువు నుంచి రుద్రాక్ష పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్షకు ఉన్నతమైన చరిత్ర ఉంది. రుద్రాక్ష ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆరోగ్య సమస్యలను నయం చేయడంతోపాటు నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేయడం, ప్రాణగండాలు రాకుండా చేయడం రుద్రాక్ష వల్లే సాధ్యమవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. రుద్రాక్షకు సంబంధించి ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి.

- Advertisement -

రుద్రాక్ష ధరించిన తర్వాత తమ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ రుద్రాక్షకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. మహిళలు రుద్రాక్షలు ధరించవచ్చా? రుద్రాక్ష ధరించి మాంసం తినవచ్చా? ఇలాంటి ప్రశ్నలు వెంటాడుతుంటాయి.

- Advertisement -

రుద్రాక్షలు వేసుకునేవారు యంత్రాన్ని ధరించడానికి ఇలాంటి కట్టుబాట్లను పాటిస్తారో అలాంటి కట్టుబాట్లనే పాటించాలి. శారీరక సంబంధంలో రుద్రాక్షను ధరించవద్దు. మాంసాహారం తినేటప్పుడు కూడా రుద్రాక్షను ధరించకూడదని పండితులు చెబుతున్నారు. రుద్రాక్షకు సంబంధించిన బీజ మంత్రాన్ని చదివిన తర్వాతే రుద్రాక్షలు వేసుకోవాలి. స్వయంగా పరమేశ్వరుడి శక్తి రుద్రాక్షలో ఉంటుంది. సాధన చేయాలనుకున్నా రుద్రాక్షతోనే చేయాలి. శివుడి పూజ చేసే వారు చాలా మంది రుద్రాక్షలు ధరించి ఉంటారు.

రుద్రాక్షతో ఫలితం త్వరగా వస్తుంది. కాబట్టి చాలామంది రుద్రాక్షలు ధరిస్తారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో విజయం సాధించడానికి, సినిమా స్టార్లు హిట్ కొట్టడానికి, విద్యార్థులు మంచి మార్కులు రావడానికి ఇలా రుద్రాక్షలు ధరిస్తుంటారు. రుద్రాక్ష ధరించడం వల్ల శరీరంలోని అనాహత చక్రం, గుండెకు సంబంధించిన చక్రం క్రియాశీలకంగా మారుతుంది. గుండెకు రుద్రాక్ష తాకే విధంగా వేసుకోవాలని చెబుతుంటారు. దీన్ని సిద్ధ మాల అని అంటారు.

Also Read: శని ఆగ్రహానికి గురై ఇబ్బందులు పడుతున్నారా.. ఈ పనులు చేస్తే అన్నీ తొలగిపోతాయి

సిద్ధ మాల ఎవరి వద్దనైతే ఉంటుందో వారి చుట్టూ ఒక రకమైన శక్తి వ్యాపించి ఉంటుంది. ఈ మాల నెగెటివ్ ఎనర్జీని కూడా దగ్గరకు రానివ్వదు. తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారికి 16 ముఖాల రుద్రాక్షను చూపిస్తే నయమవుతుందని అనేక సంఘటనలు రుజువు చేశాయి. కేవలం రుద్రాక్ష వల్ల అనారోగ్య సమస్యలు నయం కావు.. వైద్యుల సహాయం చికిత్స కూడా అవసరం

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News