Big Stories

Dream Meaning: మీ కలలో ఇలా జరిగిందా.. అయితే మీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి

Dream Meaning: పెళ్లి వయస్సు వచ్చిందంటే చాలు ఇంట్లో యువతి యువకులకు పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. దీంతో వయస్సులో ఉన్న యువతి యవకులు తమ వివాహ మహోత్సవంపై ఎన్నో కలలు కంటుంటారు. చేసుకోబోయే వాడి కోసం రాత్రిళ్లు నిద్రలోను కలలు కంటూ స్వర్గంలో తమ పెళ్లి చేసుకోబోతున్నాం అనే అనుభూతి పొందుతారు. పెళ్లి రోజు నుండి భవిష్యత్తు జీవితంలోని ప్రతి దశ వరకు, దాని గురించి కలలుకంటుంటారు. కాబోయే వారి జీవిత భాగస్వామి గురించి ఎన్నో అంచనాలు వేస్తుంటారు. అయితే కలల శాస్త్రంలో వివాహానికి సంబంధించిన కలల గురించి చాలా వివరాలు వివరించబడ్డాయి. దీని ప్రకారం, కొన్ని రకాల కలలు కనడం వల్ల త్వరలో వివాహం చేసుకోవచ్చని సూచిస్తుంది. అయితే ఎటువంటి కలలు వస్తే వివాహం జరుగుతుందో తెలుసుకుందాం.

- Advertisement -

ఇంద్ర ధనస్సు:

- Advertisement -

కలలో ఇంద్రధనస్సును చూడటం అంటే వివాహం చేసుకోవాలనే కోరిక త్వరలో నెరవేరబోతోందనే అర్థం అని కలల శాస్త్రం చెబుతుంది.

నెమలి ఈకలు:

కలలో నెమలి ఈకలను చూస్తే త్వరలో వివాహం జరగవచ్చని, భవిష్యత్ జీవితం సంతోషంగా ఉంటుందని అర్థం.

డ్యాన్స్ చేయడం:

కలలో సంతోషంగా డ్యాన్స్ చేయడం కూడా ముందస్తు వివాహానికి అవకాశాలను సృష్టిస్తుంది. ఒకవేళ పెళ్లైన వారికి ఇటువంటి కలలు వస్తే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని అర్థం.

బట్టలు:

ఒక అబ్బాయికి కలలో అందమైన రంగురంగుల ఎంబ్రాయిడరీ బట్టలు కనిపిస్తే, అతనికి చాలా అందమైన భార్య లభిస్తుంది. అతని వైవాహిక జీవితం చక్కగా సాగుతుందని అర్థం.

బంగారం:

కలలో బంగారు ఆభరణాలు కనిపిస్తే లేదా ఎవరైనా కలలో బంగారు ఆభరణాలు బహుమతిగా ఇచ్చినట్లయితే, అలాంటి అమ్మాయి ధనిక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. ఆమె భర్త చాలా ధనవంతుడు.

జాతర:

కలలో జాతరలో తిరిగినట్లు కనిపిస్తే తగిన జీవిత భాగస్వామిని కనుగొనడానికి సంకేతం అని అర్థం.

తేనె తినడం:

కలలో తేనె తింటున్నట్లు కనిపిస్తే, కుటుంబంలో ఎవరికైనా వివాహం ఫిక్స్ అవుతుందని అర్థం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News