Big Stories

Budhaditya Rajyog: బుధాదిత్య రాజయోగం ఈ రాశుల వారికి వ్యాపారంలో అద్భుత ప్రయోజనాలు..

Budhaditya Rajyog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలు వాటి నిర్ణీత సమయంలో సంచరిస్తాయి. గ్రహాల రాజైన సూర్యుడు ప్రతి నెలా తన స్థానాన్ని మారుస్తూ ఉంటాడు. ఈ తరుణంలో అన్ని రాశులపై దీని ప్రభావం ఉండబోతుంది. జూన్ 14న సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉండటం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఈ సంయోగ ప్రభావం జూన్ 29 వరకు అన్ని రాశులపై ఉండబోతుంది. అయితే ఏ రాశులపై దీని ప్రభావం ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

మిథున రాశి

- Advertisement -

ఈ రాశిలోనే సూర్యుడు, బుధుడు కలయిక ఏర్పడుతుండడం వల్ల బుధాదిత్య రాజ్యయోగం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిలో మిథున రాశి వారికి ఈ రాజయోగం అదృష్టకరం కానుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి నుండి లాభం పొందవచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం పూర్తిగా మద్దతు ఇస్తుంది. అదే సమయంలో విదేశాలలో ఉద్యోగం కావాలని కలలు కంటున్నట్లయితే అది నెరవేరుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులలో తీసుకునే నిర్ణయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి.

సింహ రాశి

మిథునరాశిలో ఏర్పడిన బుధాదిత్య రాజయోగం సింహ రాశి వారికి వరం కంటే తక్కువ కాదనే చెప్పాలి. ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. అదృష్టం వ్యక్తికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. డబ్బు సంపాదనలో విజయం సాధిస్తారు. నిలిచిపోయిన పని ఆగిపోతుంది. ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా పొందుతారు. వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి బుధాదిత్య రాజయోగం వరాలు కురిపిస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డబ్బు, పనులు పూర్తవుతాయి. కొన్ని శుభవార్తలు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో కూడా చాలా లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఊహించని ధనలాభం ఉంటుంది. అదృష్టం ప్రకాశిస్తుంది. భూమి, ఆస్తి నుండి లాభం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News