Big Stories

Vastu Tips: ఉద్యోగం, వివాహంలో ఆటంకాలు ఉంటున్నాయా ? ఇంట్లో నుంచి ఈ వస్తువులు వెంటనే తొలగించండి

Vastu Tips: సాధారణంగా ఇంట్లో ఉండే వస్తువుల కారణంగా కూడా జీవితాల్లో ఆటంకాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఉద్యోగం, వివాహంలో జాప్యం జరుగుతుంది అంటే అది ఇంట్లోని వస్తువులతో కూడా ముడిపడి ఉంటుంది అని వాస్తు శాస్త్రం చెబుతుంది. అయితే ఏ వస్తువుల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలుసుకుందాం.

- Advertisement -

ఇళ్లకు వేసే తాళాలను కొన్ని పాతవాటిని ఉపయోగిస్తుంటా. అంతేకాదు కొన్ని సార్లు ఇంటికి ఏళ్ల తరబడి తాళాలు వేసి అలాగే వాడకుండా వదిలిపెడుతుంటాం. ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో కొన్ని శుభాలు కలిగిస్తే మరికొన్ని అశుభాలు కలిగిస్తాయి. ముఖ్యంగా పాడైపోయిన తాళాలను ఉపయోగించడం వల్ల జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

- Advertisement -

వివాహంలో జాప్యం

తాళాలు ఇంట్లో ఉండే పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలకు కూడా కారణం అవుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. మూసివేసిన తాళం పెళ్లికాని కొడుకు లేదా కుమార్తె వివాహాన్ని కూడా ఆపవచ్చు అని చెబుతుంది. పాత, మూసిన తాళాలు, అదృష్టానికి అడ్డుకట్ట వేయడంతో పాటు, దర్జాగా వచ్చిన అవకాశాలను కూడా వెనక్కి తిప్పికొడతాయట. అందువల్ల పొరపాటున కూడా ఇంటికి తాళం వేసి ఉంచవద్దు. తాళాలు వేసి తాళాలు లేని తాళాలు ఏవైనా ఉంటే వాటిని ఇంట్లో అస్సలు ఉంచకూడదు.

పాత బూట్లు, చెప్పులు

దురదృష్టాన్ని తెచ్చే పాత చిరిగిన బూట్లు, చెప్పులు ఇంట్లో ఉంచడం వల్ల అన్ని అశుభాలే జరుగుతాయి. నెలల తరబడి ఉపయోగించని పాత బూట్లు చెప్పులు జీవితంలో అడ్డంకులు సృష్టించవచ్చు. జీవితంలో కష్టాలను తగ్గించుకోవాలనుకుంటే బూట్లు, చెప్పులు వెంటనే బాగు చేయించడం లేక పారేయడం వంటివి చేయాలి. చిరిగిన బూట్లు, చెప్పులు ఇంట్లో అస్సలు పెట్టుకోవద్దు. వీటిని ఉంచుకోవడం వల్ల అనవసర గొడవలు పెరిగి అడుగడుగునా ప్రతి పనికి ఆటంకం ఏర్పడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News