BigTV English

AMAVASYA after 30 years:- 30 ఏళ్ల తర్వాత వచ్చిన శనిశ్చరి అమావాస్య మంచికి సంకేతమైనా…

AMAVASYA after 30 years:-  30 ఏళ్ల తర్వాత వచ్చిన శనిశ్చరి అమావాస్య మంచికి సంకేతమైనా…

Amavasya after 30 years:- హిందూమతంలో ప్రతి తిథికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో అమావాస్య తిథి మరింత ప్రాధాన్యం ఉంది.హిందూ పంచాంగం ప్రకారం, 21 జనవరి 2023న అమావాస్య వచ్చింది. శనివారం రోజున ఉదయం 6:17 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 22 జనవరి 2023న ఆదివారం అర్ధరాత్రి 2:22 గంటల వరకు ఉంటుంది.


ఈ అమవాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారు. ఆంగ్ల నూతన సంవత్సరంలో తొలిసారిగా వచ్చే ఈ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య శనివారం రోజున రావడంతో దీన్ని శనిశ్చరి అమావాస్య అని పిలుస్తారు. ఇలా శనివారం నాడు అమావాస్య వస్తే శనిశ్చరి అమావాస్య అంటారు. ఇలా జరగడం దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇదే. అందువల్ల ఈ అమావాస్యను శుభప్రదంగా భావిస్తారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మాఘ మాసంలో సూర్యుడు, శని, శుక్రుడు మూడు ప్రధాన గ్రహాలు కలిసి కుంభరాశిలోనే కలయిక ఉండబోతోంది. ఈ సమయంలో త్రిగ్రాహి సంయోగం ఏర్పడబోతోంది..


ఇదే రోజున పుర్వ ఆషాఢ, ఉత్తర ఆషాఢ నక్షత్రాల ప్రభావం ఉంటుంది. వీటితో పాటు హర్ష యోగం, చతుష్పాద కరణ యోగాలు కూడా అమావాస్య తిథిలో ఏర్పడనున్నాయి. ఈ కాలంలో శని దేవుడు మకరం నుంచి కుంభ రాశిలోకి సంచారం చేస్తాడు.

శనివారం నాడు శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తే దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. శనిదేవుడి ఆలయానికి వెళ్లి ఆవనూనె దీపం వెలిగించి తిరిగి వచ్చేటప్పుడు శనిదేవుడికి మీ వీపు చూపకుండా ఇంటికి చేరుకోవాలి. వీపు చూపిస్తే అశుభంగా భావిస్తారు. ఆపదలో ఉన్న వ్యక్తికి కానీ, నిస్సహాయుడైన వ్యక్తికి శని అమావాస్య నాడు సహాయం కోరితే.. వెంటనే చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు.

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×