Big Stories

Sun Transit 2024: సూర్యుడి సంచారం.. జూలై 16 నుంచి ఈ రాశుల వారికి అన్నీ మంచి రోజులే !

Sun Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యభగవానుడిని గ్రహాలకు రాజు అని పిలుస్తారు. సూర్యుడు శుభ స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తి అదృష్టాన్ని పొందుతాడు. సూర్యుడు జూలై నెలలో రాశి మార్చుకోబోతున్నాడు. కర్కాటక రాశిలోకి సూర్యుడి సంచారంతో జూలై 16 నుంచి కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి.

- Advertisement -

సూర్యుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలసివస్తుంది. జూలై 16న సూర్యుడు రాశి మార్చుకోనున్నాడు. ఈ రోజున సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు నెల రోజుల పాటు ఒకే రాశిలో సంచరిస్తాడు. సూర్యుడు ఏ రాశిలోకి వెళ్తే ఆ సంక్రాంతి వస్తుంది. జూలై 16న కర్కాటక సంక్రాంతిగా చెబుతారు. సూర్యుడు ఏ రాశిలో అయినా శుభ స్థానంలో ఉంటే ఆ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. సూర్యుడి రాశి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. సూర్య సంచారం వల్ల ఏ రాశుల వారికి మేలు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

మేష రాశి:
మీ ఆదాయం పెరుగుతుంది. అధికారుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది కుటుంబం నుంచి కూడా మద్దతును పొందుతారు. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మనసులో సంతోషం పెరుగుతుంది. మీరు మీ ఉద్యోగంలో భాగంగా మరొక ప్రదేశానికి వెళ్లవలసి వస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

వృషభ రాశి:
తల్లిదండ్రుల నుంచి మీరు మద్దతు పొందుతారు. అంతే కాకుండా వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. కుటుంబ సౌఖ్యాలు, సౌకర్యాలు పెరుగుతాయి. ఉద్యోగం చేసే చోట మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి.

మిథున రాశి:
స్నేహితుడి సహాయంతో వ్యాపారం పెరుగుతుంది. లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఏదైనా మతపరమైన ప్రదేశాలకు విహార యాత్రకు వెళ్లే అవకాశాలున్నాయి. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది. మీకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపార పరిస్థితులు కూడా మెరుగుపడతాయి కుటుంబంలో. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహ రాశి:
సూర్యుడు సింహ రాశికి అధిపతి. సూర్యుడి సంచార ప్రభావం సింహ రాశిపై ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ మార్పుతో మీరు మరొక ప్రదేశానికి మారాల్సి ఉంటుంది. ఎగుమతి, దిగుమతుల వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల నుంచి మద్దతు పొందుతారు, వాహన సౌఖ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు పెరుగుతాయి. మీరు సోదరుల నుంచి మద్దతు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బట్టలు మొదలైన బహుమతులను కూడా పొందే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News