Big Stories

Shukra Uday 2024: ఉదయించనున్న శుక్రుడు.. 260 రోజులు 3 రాశుల వారికి గోల్డెన్ టైమ్

Shukra Uday 2024: జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు సంపద, భౌతిక ఆనందం, ప్రేమ సంబంధాలపై ప్రభావం చూపుతాడు. జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు వ్యక్తుల జీవితాల్లో డబ్బుకు లోటు ఉండదు. 12 రాశుల్లో అన్ని రాశుల వారు విభిన్న స్వభావాలు, అలవాట్లు, అభిరుచులను కలిగి ఉంటారు. అన్ని రాశులు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక గ్రహం వల్ల ప్రభావితం అవుతాయి.

- Advertisement -

శుక్రుడి సంచారం అన్ని రాశులపై ఉంటుంది. శుక్రుడు జూన్ 12న మిథున రాశిలో ప్రవేశించాడు. ఇది బుధ గ్రహానికి చెందిన రాశి. శుక్రుడు మిథున రాశిలో సంచరించడం వల్ల ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. తొమ్మిది గ్రహాల్లో శుక్రుడు అత్యంత విలాసవంతమైన గ్రహంగా చెబుతారు. సంపద ,శ్రేయస్సు, ప్రేమ, వివాహం మొదలైన వాటికి శుక్రుడు కారకుడు.

- Advertisement -

శుక్రుడు నెలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. ఒక వేళ శుక్రుడు శిఖరాగ్రంలో ఉంటే వారికి అన్ని రకాల యోగాలు అభిస్తాయి. త్వరలో శుక్రుడు చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. సంపద, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడి ప్రభావంతో ఏ రాశుల వారు అదృష్టాన్ని పొందుతారో తెలుసుకుందాం.

వృషభ రాశి: మిథున రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల వృషభ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారు ఏళ్ల తరబడి నలిచిపోయిన పనులను ప్రారంభిస్తారు. ఆర్థిక లాభాలు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది. సంతోషం, శాంతి వాతావరణం పెరుగుతుంది. శుక్రుడి ప్రభావంతో కెరీర్‌లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
తులా రాశి: మిథున రాశిలో శుక్రుడి ప్రవేశం వల్ల తులా రాశి వారు ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. అంతే కాకుండా సహోద్యోగుల మద్దతుతో మీరు కెరీర్‌లో అన్ని పనులను చక్కగా పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

Also Read: ఆషాఢ బోనాలు ఎందుకంత ప్రత్యేకం.. అసలు బోనాలు రోజున ఏం చేస్తారు ?

కన్యా రాశి: మిథున రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల కన్యా రాశి వారు అద్భుత ఫలితాలను పొందుతారు. వీరి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారు శుభవార్తలు వింటారు. స్నేహితుడి సహాయంతో జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News