Big Stories

Vijayawada: విజయవాడలో అందరూ చూస్తుండగానే మర్డర్..కూతురు ప్రేమ వ్యవహారమే కారణం!

Vijayawada crime news today(AP latest news): విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే మర్డర్ జరగడం కలకలం రేపుతోంది. బృందావన్ కాలనీలో ఓ వ్యాపారిని యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సింధు భవన్ వద్ద కిరాణం షాపు నిర్వహిస్తున్న భవానీ పురానికి చెందిన శ్రీరామచంద్ర ప్రసాద్‌ను రాత్రి షాపు మూసి ఇంటికి వెళ్తున్న సమయంలో విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ దారుణంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.

- Advertisement -

భవానీపురంలోని చెరువు సెంటర్‌కు చెందిన శ్రీరామచంద్ర ప్రసాద్.. బృందావన్ కాలనీలో కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. ఆయన కుమార్తె దర్శిని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతోంది. ఆమెకు నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇన్‌స్టాలో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే ఇటీవల ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో మందలించాడు.

- Advertisement -

ప్రైవేట్ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న మణికంఠ, దర్శిని మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. తండ్రి మందలించడంతో మణికంఠను దర్శిని దూరం పెడుతూ వస్తుంది. ఈ తరుణంలో తనను పెళ్లి చేసుకోవాలని దర్శినిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న ప్రసాద్..10మందితో కలిసి మణికంఠ ఇంటికి వెళ్లి త కూతురి జోలికి రావొద్దని బెదిరించాడు. ఈ విషయంపై మణికంఠను తల్లి మందిలించడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో మణికంఠ తల్లి ఇంటినుంచి వెళ్లిపోయింది.

తన తల్లి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ప్రసాద్ కారణమని ఆవేశంతో చంపేందుకు ప్లాన్ చేశాడు. గురువారం రాత్రి వెదురు కట్టలు నరికే వారి వద్దకు వెళ్లి కత్తితో పని ఉందని చెప్పి తీసుకెళ్లాడు. సరిగ్గా రాత్రి 9 గంటల సమయంలో తండ్రీకూతుళ్లు కిరాణం షాపు మూసే సమయానికి అక్కడికి మణికంఠ చేరుకున్నాడు. కిరాణం షాపు సమీపంలో నిల్చున్న మణికంఠ.. ఒక్కసారిగా తన బైక్‌తో ప్రసాద్ బైక్ ను ఢీకొట్టాడు. కిందపడిన ప్రసాద్‌ను కూతురి ముందే మణికంఠ ఆరుసార్లు కత్తితో పొడిచాడు. తన తండ్రిని చంపొద్దని బతిమిలాడినా మణికంఠ పట్టించుకోకుండా పొడిచి చంపేశాడు.

Also Read: కర్ణాటకలో దారుణమైన యాక్సిడెంట్, లారీని ఢీ కొన్ని టెంపో, 14 మంది మృతి

హత్య చేసిన అనంతరం మణికంఠ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే ప్రసాద్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించాడు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కృష్ణలంక పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. దర్శిని ఫిర్యాడు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News