Big Stories

Seized Ganja Burned: రాష్ట్రవ్యాప్తంగా పట్టుబడిన గంజాయి దహనం!

Seized Ganja Burned by Telangana Police: సికింద్రాబాద్‌లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినయోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని అధికారులు దహనం చేశారు. యాదాద్రి భువన గిరి జిల్లాలోని తుర్కాపూర్‌లో ఉన్న ఓ ఇండస్ట్రీస్‌లో బుధవారం 1,575 కిలోల గంజాయిని దహనం చేశారు. రూ. 4 కోట్ల విలువ చేసే ఈ గంజాయిని 52 కేసులలో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డ్రగ్ డిస్పోజల్ కబిటీ చైర్మన్ చందనా దీప్తి, అర్బన్ రైల్వే డిఎస్పీ.ఎస్.ఎస్. జీవీద్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో చందనా దీప్తి మాట్లాడారు. 2021 నుంచి 2023 వరకు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచీగూడ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో 52 కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని దహనం చేసినట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని గంజాయిని దహనం చేయడం సంతోషకరం అని అన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలకు అలవాటు పడటంతో పాటు అమ్మడం, కొనడం వంటివి చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Also Read: బాపట్ల యువతి అత్యాచారం, హత్య కేసులో పురోగతి

సికింద్రాబాద్ అర్బన్‌లో 22 కేసుల్లో రూ. 1,44,75,000 విలువ చేసే 579 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా సికింద్రాబాద్ రూరల్‌లో రూ. 24,50,000 విలువ చేసే 98.68 కిలోల గంజాయిని 5 కేసుల్లో స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మిగతా 896.70 కేజీల గంజాయిని ఖాజీపేట డివిజన్ పరిధిలో 25 కేసుల్లో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ రూ. 2,24,00,000 ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News