Big Stories

Vetapalem Ramapuram beach: తీవ్ర విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి!

Vetapalem Ramapuram beach: ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులు సరదాగా ఈతకు వెళ్లారు. అయితే, అందులో నలుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ఇద్దరు కూడా మరిణించారని, మృతదేహాల కోసం గాలిస్తున్నామంటూ మత్స్యకారులు, సహాయక సిబ్బంది వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల్లో వస్తున్న సమాచారం ప్రకారం..

- Advertisement -

ఏపీలోని వేటపాలెం రామాపురం బీచ్ లో కొంతమంది విద్యార్థులు సరదాగా ఈతకు వెళ్లారు. అలల తాకిడికి ఒక్కసారిగా నలుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. సహాయం కోసం కేకలు వేసినా ఉపయోగం లేకుండా పోయింది. మరో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారిద్దరూ కూడా మరిణించినట్లు మత్స్యకారులు చెబుతుండగా.. మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు. వారంతా కూడా ఏలూరు నుంచి వచ్చిన విద్యార్థులుగా గుర్తించారు. వారితో వచ్చిన విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

- Advertisement -

Also Read: రీల్స్ చేయాలనుకుని చెట్టుకు ఉరేసుకున్నట్లు నటించబోయాడు.. చివరకు..

మృతిచెందిన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆ వార్తా కథనాల్లో పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News