Big Stories

Bapatla: బాపట్ల యువతి అత్యాచారం, హత్య కేసులో పురోగతి

Bapatla: ఏపీలోని బాపట్ల జిల్లా యువతి హత్య కేసులో పురోగతి లభించింది. బహిర్భూమికి వెళ్లిన యువతిపై కొందరు వ్యక్తులు అత్యాచారం చేసి, హతమార్చిన ఘటన కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని హోం మంత్రిని ఆదేశించారు. అంతే కాకుండా దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా చీరాల మండలం శుక్రవారం ఈవూరుపాలెంలో దారుణం జరిగింది. ఈవూరుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలోని సీతారామపేటకు చెందిన చేనేత కార్మికుడి కుమార్తె (21)  సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. అయితే అలా వెళ్లిన తమ కుమార్తె ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. అంతలోనే చెట్ల మధ్య విగతజీవిగా పడి ఉన్న యువతిని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో పాటు పలువురు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

- Advertisement -

హోం మంత్రి కూడా శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ కూతురు టైలరింగ్ చూస్తూ కుటుంబాన్ని చూసుకునేదని, తమకు ఏ ఆధారం లేదని తెలిపారు. తమకు న్యాయం చేయాలని మంత్రిని వేడుకున్నారు. సీఎం ఈ అంశంపై డీజీపీతో మాట్లాడారని డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ దీనిపై స్పందించారని మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే కేసును స్వయంగా బాపట్ల ఎస్పీ వకూల్ జిందాల్ విచారిస్తున్నారు. అదే గ్రామానికి చుందిన యువకులు హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: అనుమానంతో ఆరేళ్ల కూతుర్ని చంపిన తండ్రి.. మిస్సింగ్ కేసు పెట్టి డ్రామా

20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఓ యువకుడు నేరం ఒప్పుకున్నట్లు సమాచారం. హత్యతో మరికొంత మందికి సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గంజాయి, మద్యం మత్తులో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News