Big Stories

Police firing in pedda amberpet: హైదరాబాద్‌లో పట్టపగలు కాల్పులు.. అసలు ఏం జరిగిందంటే?

Police Firing into the Air at Pedda Amberpet: హైదరాబాద్‌లో శివారులోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో పట్టపగలు కాల్పులు కలకలం సృష్టించాయి. జాతీయ రహదారిపై పార్కింగ్ చేసిన వాహనాలను లక్ష్యం చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో నల్గొండ పోలీసులు అప్రమత్తమై నిఘా పెట్టారు. చోరీలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా..ఎదురుదాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు.

- Advertisement -

తెల్లవారుజామున నల్గొండలో దోపిడీ దొంగలు పోలీసులకు కనిపించారు. చోరీలకు పాల్పడుతున్న ఈ దొంగలను అనుసరిస్తూ వస్తున్న క్రమంలో హైదరాబాద్‌లోని ఓఆర్ఆర్ వద్ద నల్గొండ పోలీసులపై దొంగలు కత్తులతో దాడికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

- Advertisement -

దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దొంగలను పట్టుకునేందుకు రాచకొండ, నల్గొండ పోలీసులు సంయుక్తంగా ప్రయత్నించారు.

గత కొంత కాలంగా జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలను లక్ష్యంగా చేసుకొని చోరీలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు దొంగల ముఠా తారసపడ్డారు. ఈ క్రమంలో దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు. చివరికి రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చాక ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు.

Also Read: మియాపూర్ యువతి అత్యాచారం కేసులో ట్విస్ట్

పెద్ద అంబర్‌పేట సమీపంలోని ఓఆర్ఆర్ వద్దకు వచ్చేసరికి అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో నిందితులు కత్తులతో ఎదురుదాడి చేశారని, అందుకే గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో నిందితులను అదుపులోకి విచారణ చేపట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News