Big Stories

poisonous gas inside well in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో విషాదం..విషవాయువు పీల్చి ఐదుగురు మృతి

Five dead poisonous gas inside well in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జంజ్‌గిర్- చంపా జిల్లా కికిర్దా గ్రామంలో బావిలో విషవాయువులు పీల్చడంతో ఐదుగురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

శుక్రవారం ఉదయం బావిలో పడిపోయిన చెక్క స్ట్రిప్ తీసేందుకు ప్రయత్నించి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓ చెక్క స్ట్రిప్ బావిలో పడిపోవడంతో దానిని తీసేందుకు జైస్వాల్ అందులోకి దిగాడు. జైస్వాల్ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు బావిలోకి చూశారు. అయితే అతను స్పృహ తప్పి పడినట్లు కనిపించడంతో సమీపంలో ఉన్న పటేల్ కుటుంబానికి చెప్పారు.

- Advertisement -

బావిలో స్పృహ తప్పి పడిన జైస్వాల్‌ను కాపాడేందుకు పటేల్ కుటుంబంలో మరో ముగ్గురు బావిలోకి దిగారు. కొంత సమయం తర్వాత ఈ ముగ్గురిని కూడా ఎంత పిలిచినా పలకకపోవడంతో ఇద్దరి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రక్షించే ప్రయత్నంలో చంద్ర కూడా స్పృహ తప్పి పడిపోయాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బిలాస్‌పూర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజీవ్ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం.. బావిలోపల విషవాయువు ఉందని, ఆ గాలి పీల్చడంతో ఊపిరిఆడక ఐదుగురు మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించాడు. వెంటనే ఎస్‌డీఆర్ఎఫ్ బృందం సభ్యులు ఆ బావి నుంచి ఐదుగురు మృతదేహాలను బయటకు తీశారు.

Also Read: కోటాలో వరుస ఆత్మహత్యలు… బీహార్ విద్యార్థి సూసైడ్

మృతులు రామచంద్ర జైస్వాల్, రమేష్ పటేల్, రాజేంద్ర పటేల్, జితేంద్ర పటేల్, టికేశ్వర్ చంద్రగా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News