Big Stories

Mumbai: దారుణం.. నడిరోడ్డుపై ప్రియురాలిని 18 సార్లు ఇనుప రెంచ్‌తో కొట్టి చంపిన ప్రియుడు

Man kills woman by hitting 18 times with Iron Wrench: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెపై ఇనుప రెంచ్ తో 18 సార్లు కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో వసాయ్ ప్రాంతంలో జరిగింది. ఆ మహిళపై దాడి జరుగుతున్న సమయంలో ఘటనా స్థలం వద్ద ఉన్న ఓ వ్యక్తి ఆపబోయాడు. అతడిపై కూడా నిందితుడు దాడిచేయబోయాడు. అయితే, ఈ ఘటనను అక్కడే ఉన్న పలువురు తమ ఫోన్లలో వీడియో తీశారు. కానీ, ఆపే ప్రయత్నం చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

- Advertisement -

రోహిత్ యాదవ్ అనే వ్యక్తి ముంబైలోని వసాయ్ లో తన ప్రియురాలైనటువంటి ఆర్తి యాదవ్(20)ను అతి దారుణంగా హత్య చేశాడు. ఇనుప రెంచ్ తో ఆమె తలపై 18 సార్లు కొట్టి చంపేశాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆపే ప్రయత్నం చేశాడు. కానీ, నిందితుడు అతడిని కొట్టే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న ఇంకొంతమంది మాత్రం చూస్తూ ఉండిపోయారు తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ కొద్ది రోజుల క్రితం ప్రేమించుకుని విడిపోయారని, ఈ క్రమంలో బాధిత మహిళ మరో అబ్బాయితో చనువుగా ఉంటుందని.. దీంతో కోపంతో ఆమెను హత్య చేశానంటూ నిందితుడు చెప్పినట్లు సమాచారం.

- Advertisement -

Also Read: కూతురిని దారిలో పెట్టాలనుకున్న తండ్రి.. ప్రాణానికే శాపమైన పేగుబంధం

కాగా, ఈ ఘటనంతా కూడా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News