Big Stories

Five from Telangana died in Pune: పుణెలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతి

Five from Telangana died in Pune: మహారాష్ట్రలోని పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృత్యువాతపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకులు టూరిజం కోసం మహారాష్ట్రకు వెళ్లారు. భిగ్వాన్ సమీపంలో ఇంటికి తిరిగి వస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అయితే, సమీపంలో ఉన్నవారు వారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. యువకుల మృతివార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులంతా 25 ఏళ్ల లోపు యువకులేనని పోలీసులు తెలిపారు.

- Advertisement -

అయితే, భార్ఘవ్ ఎక్స్‌ప్రెస్ వే దగ్గర పుణె – షోలాపూర్ జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో డీల్ దలాజ్ సమీపంలోని భిగ్వాన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు రఫీక్ ఖురేషీ, ఇర్ఫాన్ పటేల్, మెహబూబ్ ఖురేషి, ఫిరోజ్ ఖురేషిగా గుర్తించారు. మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందినవారుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

- Advertisement -

Also Read: నూతన చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదు!

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాలు జారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే ఈ యువకులు ప్రయాణిస్తున్న వాహనం జారిపోవొచ్చని, ఆ తరువాత నియంత్రణ కోల్పోయే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News