Big Stories

First Case registered in Telangana: నూతన చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదు!

First Case registered in Telangana: నేటి నుంచి దేశవ్యాప్తంగా నూతన క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఈ చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదు అయ్యింది. నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై చార్మినార్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు అయ్యినట్లు తెలుస్తోంది. కొత్త చట్టాల ప్రకారం సెక్షన్ 281 బీఎన్ఎస్, ఎంవీ యాక్ట్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ ను డిజిటల్ గా నమోదు చేశారని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

కాగా, కొత్త చట్టాల్లోని న్యాయ సంహిత కింద దేశంలో తొలి కేసు నమోదు అయ్యింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పరిధిలోని ఓ వీధి వ్యాపారిపై న్యూ క్రిమినల్ కోడ్ లోని సెక్షన్ 285 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద విక్రయాలు జరిపినందుకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని బీహార్ లోని బార్హ్ కు చెందిన పంకజ్ కుమార్ గా గుర్తించారు. కమలా మార్కెట్ ప్రాంతంలో ప్రధాన రహదారికి దగ్గరలో బండిపై వాటర్ బాటిల్స్, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్మడాన్ని పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. దానివల్ల రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దానిని మరోచోటకు తరలించాలంటూ అతడికి పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండాపోయింది. దానివల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పోలీసులు వీడియో తీసి, కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

- Advertisement -
DGP
DGP

నూతన చట్టాలపై పోస్టర్ల ఎస్ఓపీ విడుదల

నూతన చట్టాలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఇంగ్లీష్, తెలుగులో పోస్టర్లను డీజీపీ రవి గుప్తా విడుదల చేశారు. కొత్త చట్టాల గురించి అవగాహన ప్రచారంలో భాగంగా ఈ పోస్టర్లు అన్ని పోలీసు స్టేషన్లలో ప్రదర్శించబడతాయని తెలిపారు. కొత్త చట్టాల గురించి పౌరులకు మార్గనిర్దేశం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేషన్లలో స్టాండర్డ్ ఆపరేటింగ్‌ ప్రొసీజర్ పై సమగ్ర బుక్‌లెట్‌ను కూడా విడుదల చేశారు.

ఇందులో 43 SOPలు మరియు 31 ప్రొఫార్మాలు, కొత్త విధానపరమైన చట్టంలోని చాలా ముఖ్యమైన అంశాలు ఉంటాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దర్యాప్తు అధికారులు ఒకే రకమైన విధానాలను పాటించేందుకు స్పష్టత ఉంటుందన్నారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సహకారంతో సీఐడీ ద్వారా ఎస్ఓపీలు అభివృద్ధి చేయబడ్డాయన్నారు. సీఐడీ అడిషనల్ డీజీపీ శిఖా గోయెల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ శింగేనవర్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, వైజయంతిలు కృషి చేశారంటూ పేర్కొంటూ.. వారిని ఈ సందర్భంగా డీజీపీ ప్రశంసించారు. కొత్త చట్టాలపై దర్యాప్తు అధికారులకు మార్గనిర్దేశం చేసేందుకు సీఐడీ విభాగంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రం నేడు ఉదయం 8 గంటల నుండి పనిచేయడం ప్రారంభించిందని తెలిపారు. ఇది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు.

Also Read: ‘త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. సీతక్కకు హోంమంత్రి పదవి’

ఇప్పటికే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులందరూ శిక్షణ పొందారని డీజీపీ తెలిపారు. టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్ శిక్షణా విభాగాన్ని అభినందించారు. సాంకేతిక విభాగం పర్యవేక్షించిన అడిషనల్ డీజీపీ వి.వి. శ్రీనివాసరావును కొనియాడారు. మహేష్ భగవత్ (అడిషనల్ డీజీపీ రైల్వేస్ & రోడ్ సేఫ్టీ ఇంచార్జ్ లీగల్) తోపాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News