Big Stories

BJP Yuva Morcha Leader Murder: మంత్రికి అత్యంత సన్నిహితుడు.. బీజేపీ యువ నాయకుడు.. నగర ఉపాధ్యక్షుడు మోను కళ్యాణే దారుణ హత్య!

BJP Yuva Morcha Leader Murdered: బీజేపీ మంత్రికి అత్యంత సన్నిహితుడు, బీజేపీ యువమోర్చా నగర ఉపాధ్యక్షుడు మోను కళ్యాణే దారుణ హత్యకు గురైన ఘటన ఆదివారం ఇండోర్ లో జరిగింది. మోను.. మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి కైలాష్ విజయవర్గియాకు సన్నిహితుడు. ఎంజీరోడ్ పీఎస్ పరిధిలోని చిమన్ బాగ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. పాతకక్షల నేపథ్యంలో పీయూష్, అర్జున్ అనే ఇద్దరు మోను ను కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

మోను కల్యాణే ఇండోర్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాడు. ఇతను కైలాష్ విజయవర్గీయ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ఆకాష్ విజయవర్గీయకు అత్యంత సన్నిహుతుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోను కల్యాణే శనివారం రాత్రి భగవా యాత్రకు సిద్ధమవుతుండగా.. పీయూష్, అర్జున్ అనే ఇద్దరు యువకులు చిమన్ బాగ్ కూడలికి బెక్ పై వెళ్లారు.

- Advertisement -

Also Read : బాపట్ల యువతి అత్యాచారం, హత్య కేసులో పురోగతి

అక్కడే ఆగి.. బైక్ పైనే కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. వారికి సమీపంలోకి వచ్చిన మోను కల్యాణేపై అర్జున్ తుపాకీతో కాల్పులు జరిపాడు. వెంటనే ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. మోను స్నేహితులపై కూడా కాల్పులు జరుపగా వారు తప్పించుకున్నారు. గాయపడిన మోనును ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. ఆకాష్ విజయవర్గీయ మోను కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులకు శిక్షపడేలా చూస్తామని చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News