Big Stories

Volkswagen Tharu XR : వోక్స్‌వ్యాగన్ కొత్త ఎస్యూవీ ‘థారు ఎక్స్‌ఆర్’ లాంచ్.. స్పెసిఫికేషన్లు ఇవే..!

Volkswagen Tharu XR : ఆటో మొబైల్ మార్కెట్‌లో వోక్స్‌వ్యాగన్ ఎస్యూవీలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలా మోడళ్లను పరిచయం చేసిన కంపెనీ తాజాగా వోక్స్ వ్యాగన్ కొత్త ఎస్యూవీని మార్కెట్‌లో దించింది. ‘థారు ఎక్స్‌ఆర్’ పేరుతో కొత్త ఎస్యూవీని చైనా మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ కొత్త కారు చైనాలో సేల్‌కు అందుబాటులో ఉన్న చిన్న టి-క్రాస్, థారు మధ్యలో ప్లేస్‌ అయి ఉంటుంది.

- Advertisement -

ఈ కొత్త వోక్స్‌వ్యాగన్ థారు ఎక్స్‌ఆర్ కారు చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. అలాగే దీనిలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరింత స్టైలిష్‌గా ఉంటాయి. కాగా దీని LED DRL ఫేస్ వెడల్పుగా కనిపిస్తుంది. బ్రస్డ్ అల్యూమినియంలో ఫినిష్ చేసిన ప్లాస్టిక్‌తో బ్యాక్‌సైడ్ బంపర్ కూడా పెద్దగానే ఉంటుంది. ఇక ఈ కొత్త వోక్స్‌వ్యాగన్ థారు ఎక్స్‌ఆర్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ ఎస్యూవీలో 1.5 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.

- Advertisement -

Also Read: ఫ్రాంక్స్​ సరికొత్త ఎడిషన్​ లాంచ్​.. స్పెసిఫికేషన్స్ అదుర్స్..!

కాగా ఈ కారు టాప్ వేరియంట్లు 158bhp పవర్, 250nm గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. ఇందులో DSG ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనే ఆప్షన్ కూడా ఉంది. అంతేకాకుండా మాన్యువల్ గేర్‌బాక్స్ కూడా అందించే ఛాన్స్ ఉంది. ఇందులో కొన్ని కాస్మోటిక్ తేడాలు మినహాయిస్తే.. ఈ కొత్త థారు ఎక్స్‌ఆర్ ఇండియా స్పెక్ టైగన్‌తో లేఅవుట్ ఫీచర్లను షేర్ చేసుకుంటుంది. ఈ కొత్త ఎస్యూవీ.. ఇండియా స్పెక్ టైగన్‌లో 385 లీటర్ బూట్ సామర్థ్యం కంటే అత్యంత పెద్దదిగా ఉంటుంది.

కాగా ఈ కొత్త వోక్స్‌వ్యాగన్ థార్ ఎక్స్‌ఆర్ ప్రస్తుతం చైనా మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం అక్కడ మాత్రమే సేల్ నడుస్తోంది. అయితే వోక్స్‌వ్యాగన్ ఇండియా మాత్రం ఈ ఎక్స్ఆర్‌ను ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం లేదని వినిపిస్తోంది. అయితే ఈ కొత్త థారు ఎక్స్ఆర్‌కు సంబంధించిన ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. త్వరలో ఈ కారు ధర వివరాలు వెల్లడికానున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News