Big Stories

Vodafone-Idea Recharge Plan: యూజర్లకు వరుస షాక్‌లు.. మొన్న జియో, నిన్న ఎయిర్‌టెల్, ఇవాళ వొడాఫోన్-ఐడియా.. భారీగా పెంచేసింది బాబోయ్?

Vodafone-Idea Recharge Plan increasing: ప్రస్తుత కాలంలో అందరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ఆ ఫోన్‌కు రీఛార్జ్ కూడా కామన్ అయిపోయింది. అదే సమయంలో రీఛార్జ్ ప్లాన్ గడువు అయిపోతే వితిన్ సెకన్లో రీఛార్జ్ చేసుకునే స్టేజ్‌కి వచ్చారు. ఇక టెలికాం సంస్థలు కూడా రీఛార్జ్ ఆఫర్లు ఇస్తున్నట్లే ఇచ్చి వినియోగదారులకు షాకిస్తున్నాయి. ఇందులో భాగంగానే రీఛార్జ్ ప్లాన్‌ ధరలు పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్ననే ప్రముఖ టెలికాం దిగ్గజం జియో తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

- Advertisement -

ఇక నిన్న ఎయిర్‌టెల్ కంపెనీ టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ కొత్త ఛార్జిలు వచ్చే నెల అంటే జూలై 3 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపాయి. అయితే ఈ రెండు టెలికాం కంపెనీలే కాకుండా ఇప్పుడు మరొక టెలికాం కంపెనీ తన రీఛార్జ్ ప్లాన్‌లు పెంచుతున్నట్లు తెలిపింది. ప్రముఖ సంస్థ వొడాఫోన్ – ఐడియా తమ యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచుతున్నట్లు ఇవాళ ప్రకటించింది. ఈ కొత్త ఛార్జిల ధరలు జూలై 4 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు ఈ టెలికాం సంస్థ 5జీ నెట్‌వర్క్‌లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

- Advertisement -

Also Read: జియో బాటలో ఎయిర్‌టెల్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు!

వొడాఫోన్- ఐడియా పెంచిన రీఛార్జ్ ప్లాన్ ధరలు

ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.179 ఉండగా ఇప్పుడు రూ.199కి పెంచింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, 2జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

అలాగే రూ.459 ప్లాన్ ఇప్పుడు రూ.509గా మారింది. ఇది అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్, 6జీబీ డేటాతో వస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.

రూ.1799 ఏడాది ప్లాన్ ఇప్పుడు రూ.1999కి పెంచింది. ఈ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. అన్‌లిమిటెడ్ కాల్స్, 300ఎస్ఎంఎస్, 24జీబీ డేటా అందుతుంది.

రూ.269 ప్లాన్ ఇప్పుడు రూ.299కి పెరిగింది. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 1జీబీ డేటా, డైలీ 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

రూ.299 ప్లాన్‌ రూ.349కి పెరిగింది. అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎంఎస్, 1.5జీబీ డేటా వస్తుంది. అంతేకాకుండా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటా పొందొచ్చు. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

Also Read: భారీగా పెరిగిన జియో రీచార్జ్ ధరలు.. అంబానీపై ట్రోల్స్..!

అలాగే 319 ప్లాన్ రూ.379కి, 479 ప్లాన్ రూ.579కి, రూ.539 ప్లాన్ రూ.649కి, రూ.719 ప్లాన్ రూ.859కి, రూ.839 ప్లాన్ రూ.979కి, రూ.2899 ఇయర్లీ ప్లాన్ రూ.3499కి, రూ.19 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రూ.22కి, రూ.39 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రూ.48కి పెరిగాయి.

అలాగే పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ విషయానికొస్తే.. రూ.401 ప్లాన్.. రూ.451కి, రూ.501 ప్లాన్ రూ.551కి, రూ.601 ఫ్యామిలీ ప్లాన్ రూ.701కి, రూ.1001 ప్లాన్ రూ.1201కి మారింది. ఈ కొత్త ఛార్జిలు జూలై 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News