Big Stories

July Launch Vehicles List: జూలైలో ఆటోమొబైల్ మార్కెట్‌లో సందడే సందడి.. మొత్తం ఎన్ని వాహనాలు లాంచ్ అవుతున్నాయంటే?

Vehicles Launching in July Month 2024: 2024 జూన్ నెలలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ మోడళ్లను లాంచ్ చేస్తూ వాహన ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ జూన్ నెల దాదాపు ముగింపుకు చేరుకుంది. దీంతో ఇప్పుడు మరికొద్ది రోజుల్లో జూలై నెల ప్రారంభం కాబోతుంది. ఈ తరుణంలో జూలై 2024లో ప్రముఖ కంపెనీల నుంచి పలు మోడళ్లు లాంచ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అందులో మినీ కూపర్ ఎస్, మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్, బిఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్డబ్ల్యూబీ, బిఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్‌తో సహా మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

BMW 5 Series LWB

- Advertisement -

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎండబ్ల్యూ వచ్చే నెల అంటే జూలైలో తన లైనప్‌లో ఉన్న BMW 5 Series LWBను లాంచ్ చేయనుంది. ఈ మోడల్ లాంగ్ వీల్ బేస్ రూపంలో వాహన ప్రియుల ముందుకు రానుంది. ఈ కారు 5175 మిమి పొడవు.. 1900 మిమీ వెడల్పు, 1520 మీమీ ఎత్తు, 3105 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఈ BMW 5 Series LWB కారు చూడ్డానికి 530 ఎల్‌ఐ ఎమ్ స్పోర్ట్స్ లుక్‌లో కనిపిస్తుంది. అయితే కంపెనీ ఇంకా ఈ కారు పూర్తి డీటెయిల్స్ వెల్లడించలేదు. ఇక దీని ధర అంచనా ప్రకారం.. రూ.73.5 లక్షల నుంచి రూ.78.9 లక్షల మధ్య ఉంటుందని అంటున్నారు.

బిఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్

పై మోడళ్లతో పాటు బిఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లాంచ్‌కు సిద్ధంగా ఉంది. ఈ స్కూటర్ 8.9 కిలో వాట్ బ్యాటరీతో వస్తుంది. దీని ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 130 కి.మీ మైలేజీ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 120కి.మీగా ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన వివరాలు ఇంకేమి వెల్లడికాలేదు.

Also Read: కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 130 కి.మీ మైలేజీ.. ధర తక్కువే..!

మినీ కూపర్ ఎస్

వచ్చే నెల జూలై 2024లో ఆటో మొబైల్ మార్కెట్‌లోకి రాబోతున్న మరో కొత్త తరం కారు మినీ కూపర్ ఎస్. ఈ కారు ప్రస్తుతం పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌తో రానున్నట్లు తెలిపింది. అలాగే ఈ సంవత్సరం చివరినాటికి ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ కారు తన లుక్, డిజైన్‌తో అందరినీ అట్రాక్ట్ చేస్తుందని సమాచారం. ఇందులో టెయిల్ ల్యాంప్, రౌండ్ హెడ్‌లైట్స్, 9.4 ఇంచెస్ ఓఎల్‌ఈడీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటివి ఉండనున్నాయి. ఈ మినీ కూపర్ ఎస్ మోడల్‌లో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన ఉంటుంది. అంచనా ప్రకారం.. ఇది రూ.42.70 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్

మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ జూలైలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్న మరొక కొత్త వెహికల్. దీని డిజైన్ చూసుకుంటే కొత్త కూపర్ ఎస్ లాగానే ఉంటాయి. కాగా ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారు ఇతర దేశాల్లో సేల్‌కు అందుబాటులో ఉంది. అందువల్ల భారత మార్కెట్‌లో కూడా ఈ కారు సేల్స్‌లో అదరగొడుతుందని అందరూ భావిస్తున్నారు. ఇది రెండు వెర్షన్లలో వస్తుంది. ఈ రెండు వెర్షన్‌లు 66.45 కిలో వాట్ బ్యాటరీతో వస్తాయి. ఈ కారు ధర అంచనా ప్రకారం.. రూ.48.10 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ కావచ్చని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News