Big Stories

Credit Card Precautions : క్రెడిట్ కార్డుల వినియోగిస్తున్నారు.. ఈ జాగ్రత్తలు పాటించండి..

- Advertisement -

Credit Card Precautions : మీకు క్రెడిట్ కార్డు ఉచితంగా ఇస్తున్నారంటే అది ఖచ్చితంగా నమ్మడానికి వీలు లేదు. ఏ బ్యాంకింగ్ సంస్థకూడా మీకు ఉచితంగా క్రెడిట్ కార్డులను పంపిణీ చేయదు. క్రెడిట్ కార్డులకు వార్షిక రుసుములు ఉంటాయి. కొన్నీ బ్యాంకింగ్ సంస్థలు క్రెడిట్ కార్డులకు అధిక రుసుములను ఛార్జ్ చేస్తాయి. తక్కువ చార్జీలను ఉన్న కార్డులను మాత్రమే మీరు ఎంపిక చేసుకోవాలి.

- Advertisement -

మీ క్రెడిట్ కార్డు బిల్లులను టైంకు చెల్లించనప్పుడు వడ్డీలను ఛార్జ్ చేస్తాయి. కార్డు తీసుకున్న కొత్తలో మాత్రమే మీకు మొదటి 50 రోజులకు ఎలాంటి వడ్డీ వేయరు. ప్రతీ క్రెడిట్ కార్డుకు ఓ లిమిట్ ను ఇస్తారు. ఇచ్చిన లిమిట్ లోపు మాత్రమే మీకు క్రెడిట్ లభిస్తుంది. మీరు సకాలంలో చెల్లింపులు చేస్తే తరువాత ఆ లిమిట్ మరికొంత పెరుగుతుంది.

క్రెడిట్ కార్డు బిల్లులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. రుసుము చార్జీలు, వడ్డీలు ఎక్కువ వేస్తున్నారా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏవైనా అధిక చార్జీలు వేశారని మీకు అనిపిస్తే.. వెంటనే బ్యాంకు దృష్టికి మీరు తీసుకెళ్లాలి. క్రెడిట్ కార్డుల పై మార్కెట్లో అనేక ఆఫర్లు ఉంటాయి. 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లని, రివార్డ్ పాయింట్స్ అని వస్తుంటాయి. అల్లాంటి వాటిపై మీరు బిల్లింగ్ చేసిన తరువాత జాగ్రత్తగా పరిశీలించాలి.

క్రెడిట్ కార్డు ద్వారా మీరు నేరుగా ఎటిఎం నుంచి క్యాష్ డ్రా చేయవచ్చు. క్యాష్ డ్రా చేయడంకంటే మీరు ఆన్లైన్ లో అవసరమైన పేమెంట్ చేస్తేనే మీకు లాభం ఉంటుంది. క్రెడిట్ కార్డు నుంచి క్యాష్ డ్రా చేస్తే మీకు వడ్డీ 5 శాతం వరకు ఉంటుంది. ఇది సాధారణ వడ్డీకంటే అధికం అని మరిచిపోవద్దు. డ్రా చేసేటప్పుడు పది సార్లు ఆలోచించండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News