Big Stories

UPI: యూపీఐ పేమెంట్స్‌ చేస్తే ఛార్జీల మోత.. కస్టమర్లకు కేంద్రం వాత..

UPI: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ చెల్లింపులు చేస్తున్నారా? ఇన్నాళ్లూ ఉచితంగా ఉన్న ఈ లావాదేవీలకు ఇప్పుడు ఛార్జీల మోత మోగనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఇటీవల ఓ సర్క్యులర్ విడుదల చేసింది. దీని ప్రకారం ఇకపై 2 వేల రూపాయలు చెల్లింపులు దాటిన లావాదేవీలకు 1.1 శాతం మేర ఇంటర్ చేంజ్ ఛార్జీలు విధించాలని సూచించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి రానుంది. ఈ మేరకు అగ్రిగేటర్లకు సూచించింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రుమెంట్ ఛార్జీలు.. PPI పేరుతో ఈ ఛార్జీలు వసూలు చేయనున్నారు.

- Advertisement -

చిన్న చిన్న చెల్లింపుల కోసం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ యాప్స్ వాడకం ఇటీవల విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వీటిని వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఉండడం, ఆఫర్స్, కూపన్స్ అందుబాటులో ఉండడంతో చాలా మంది వీటిని వాడుతున్నారు. ఐతే ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ ఉచితంగా అందే అవకాశం లేదు. కానీ ఇందులోనూ కొన్ని మినహాయింపులు ఉన్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్కులర్ ద్వారా తెలుస్తోంది.

- Advertisement -

లావాదేవీలు 2 వేల రూపాయలకు మించితేనే ఇంటర్ చేంజ్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే చెల్లింపులు, వ్యక్తి నుంచి మర్చంట్ కు చేసే చెల్లింపులు, బ్యాంకు నుంచి పీపీఐ వాలెట్ మధ్య జరిగే లావాదేవీలకు ఇంటర్ ఛేంజ్ ఛార్జీలు వర్తించవు. PPI జారీచేసేవారు వాలెట్-లోడింగ్ సర్వీస్ ఛార్జీగా రెమిటర్ బ్యాంక్‌కి సుమారు 15 బేసిస్ పాయింట్లను చెల్లిస్తారు.

పీపీఐ పేమెంట్స్ చేసే లావాదేవీలపై 0.5 శాతం నుంచి 1.1 శాతం వరకు ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. దానిలో పెట్రోల్, డీజిల్ కోసం చెల్లింపులపై 0.5 శాతం, టెలికాం, యుటిలిటీస్ పోస్ట్ ఆఫీస్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ పర్పస్‌కి 0.7 శాతం, సూపర్ మార్కెట్లో 0.9 శాతం, మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్, ఇన్సూరెన్స్, రైల్వేస్‌లో 1 శాతం మేర ఇంటర్ చేంజ్ ఛార్జీలు ఉంటాయి. ఈ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. సెప్టెంబర్ 30 లోపు ఈ ధరలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమీక్షించనుంది. అప్పుడు మళ్లీ సవరించే అవకాశం ఉంది.

ఈ ఏడాది జనవరిలో యూపీఐ పేమెంట్స్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. అయితే, ఫిబ్రవరి 2023లోగానే మళ్లీ భారీగా పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం యూపీఐ పేమెంట్స్ 4.8 శాతం తగ్గి పోయి నెల వారీగా రూ.12.36 లక్షల కోట్లు చేరినట్లు తెలుస్తోంది. ఐతే జనవరి 2023లో అది రూ.12.98 లక్షల కోట్లుగా ఉండేదని గణాంకాలు చెబుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News